తెలంగాణ ఆర్టీ‌సీలో స‌మ్మె సైరెన్ మోగింది

హైద‌రాబాద్:-

తెలంగాణ ఆర్టీ‌సీలో స‌మ్మె సైరెన్ మోగింది. త్రిస‌భ్య క‌మిటీతో కార్మి‌క సంఘాల చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యా‌యి. ముందే నిర్ణ‌యించిన‌ట్లు‌గా ఇవాళ అర్ధ‌రాత్రి నుంచే స‌మ్మె‌కు దిగుతున్న‌ట్లు తెలంగాణ ఆర్టీ‌సీ ఐకాస ఛైర్మ‌న్ అశ్వ‌త్ధా‌మ‌రెడ్డి‌స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన హామీలేందునే స‌మ్మె‌కు వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. డిమాండ్ల ప‌రిష్కా‌రానికి ఏర్పా‌టు చేసిన ఐఏఎస్‌ల త్రిస‌భ్య క‌మిటీ ఏ నిర్ణ‌య‌మూ తీసుకునే ప‌రిస్థి‌తుల్లో లేద‌ని ఆయ‌న చెప్పా‌రు. ఎలాంటి నోటీసుల‌కు భ‌య‌ప‌డొద్ద‌ని, నిర్భ‌యంగా రేపు ఉద‌యం నుంచి కార్మి‌కులు స‌మ్మె‌కు అన్ని వ‌ర్గా‌లు మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిగా ఐకాస నాయ‌కులు కోరారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఆర్టీ‌సీ సంస్ధ‌ను ప్ర‌భుత్వం కాపాడాల‌ని కోరారు. నాలుగేళ్లు‌గా ఏటా స‌మ్మె నోటీసు ఇస్తూ‌నే ఉన్నా‌మ‌ని, అయినా స‌మ‌స్య‌ను స‌రిష్క‌రించ‌లేద‌ని అన్నా‌రు. ఆర్టీ‌సీలో 50 వేల మంది కార్మి‌కులు పాల్గొంటార‌ని తెలంగాణ ఆర్టీ‌సీ ఐకాస ఛైర్మ‌న్ అశ్వ‌త్ధా‌మ‌రెడ్డి‌ చెప్పారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..