"సైరా నరసింహా రెడ్డి" మూవీ రివ్యూ..

కథ :

కథలోకి వెళ్లినట్టయితే 18వ దశకంలో రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(చిరంజీవి). కానీ అప్పటికే భారతదేశం పై కన్నేసిన బ్రిటిషు దేశస్థులు భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో రేనాడును ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారు.ఈ నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దేశ స్వాతంత్య్రం కోసం వారికి ఎదురు తిరుగుతాడు.వారిని ఎదిరించే క్రమంలో అవుకు రాజు(సుదీప్), రాజ పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతి బాబు)లు ఎలా తోడయ్యారు?ఆ తర్వాత నరసింహా రెడ్డి ఎదుర్కొన్న పరిణామాలు ఏమిటి? అవి ఎటువైపుకు దారి తీశాయి అన్న అంశాలు తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాకు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి కోసమే.మెగాస్టార్ అభిమానులు చిరును ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల కాలంలో చూడని ఒక సరికొత్త పాత్రలో మెగాస్టార్ కనబర్చిన నటనా తీరును భేరీజు వెయ్యడానికి మాటలు సరిపోవు.అసలు ఆరు పదులు వయసు వచ్చినా సరే అంత ఎనర్జిటిక్ గా పలికించిన డైలాగ్స్ కానీ కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి.అలాగే మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్పారో ఈ సినిమా చూసి ప్రతీ ఒక్కరికి అర్ధం అవుతుంది.అసలు నిజంగా మొట్టమొదటి స్వాతంత్ర్య ఉద్యమకారుడు అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అంటే ఇలాగే ఉంటారా?ఆ పాత్రలో చిరుని తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్న రీతిలో మెగాస్టార్ పెట్టిన అద్భుత ఎఫర్ట్స్ కోసం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.ఇక అలాగే కన్నడ హీరో కిచ్చ సుదీప్ తనదైన నటనతో ఆకట్టుకుంటారు.అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటన కోసం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

అంతేకాకుండా ఒక మెగాస్టార్ తో మరో మెగాస్టార్ గోసాయి వెంకన్నగా నరసింహా రెడ్డి గురువు పాత్రలో అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.అలాగే మెగాస్టార్ మరియు నయనతారల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే నయన్ అద్భుత నటన కనబరిచారు.అలాగే తమన్నా కూడా ఈ చిత్రంతో మరో మంచి రోల్ చేసి గుర్తుండిపోయే నటనను కనబర్చారు.అంతే కాకుండా చిన్న పాత్ర అయినా సరే నిహారిక మంచి నటన కనబరిచారు.ఈ చిత్రంతో విలక్షణ నటుడు జగపతిబాబు కెరీర్ లో మరో మంచి పాత్ర చేరింది.

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఇటువంటి సబ్జెక్టును సురేందర్ ఇప్పటి వరకు ముట్టుకోకపోయినా ఈ చిత్రాన్ని ఒక అద్భుతంలా తెరకెక్కించారు.ప్రతీ పాత్రకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరిని తక్కువ చెయ్యకుండా చాలా జాగ్రత్త వహించి తెరకెక్కించిన తీరుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే.అయితే ఫస్ట్ హాఫ్ కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదిగా మొదలవుతున్నట్టు అనిపించినా అలా ఇంటర్వెల్ కు వచ్చేసరికి మెగాస్టార్ కు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తే మాస్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతారో లాంటివి బాగా క్యారీ చేసారు.ముఖ్యంగా ఎమోషన్స్ ను చాలా చక్కగా తీర్చిదిద్దారు.

అలాగే సాయి మాధవ్ బుర్రా అందించిన కొన్ని డైలాగ్స్ కి అయితే థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ బ్లాక్స్ తో సహా ఆ విజువల్స్ ను చూస్తుంటే మాత్రం నిజంగానే 18వ శతాబ్దంలో ఉన్న భావన కలిగి తీరుతుంది.దీనికి మాత్రం రత్నవేలు అందించిన కెమెరా పనితనం అమోఘం.అలాగే సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన పాటలు ఒక్క టైటిల్ ట్రాక్ మినహా మిగతావి పర్వాలేదనిపిస్తాయి.అలాగే జూలియస్ పకియం అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.రామ్ చరణ్ అందించిన నిర్మాణ విలువలు సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.

రివ్యూ:4/5

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..