13 రామచిలుకలను అదుపులోకి తీసుకొని దిల్లీ కోర్టులో హాజరుపరిచారు సీఐఎస్​ఎ​ఫ్​ అధికారులు.

ఢిల్లీ

13 రామచిలుకలను అదుపులోకి తీసుకొని దిల్లీ కోర్టులో హాజరుపరిచారు సీఐఎస్​ఎ​ఫ్​ అధికారులు. 

చిలుకలను కోర్టులో ప్రవేశపెట్టడమేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే? కాకపోతే అవి ఏ తప్పూ చేయలేదు. అక్రమంగా ఆ చిలుకలను విదేశానికి తరలిస్తూ ఓ ఉజ్బెకిస్థాన్​ జాతీయుడు పట్టుబడ్డాడు. అతనితో పాటు ఆ చిలుకలను అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చారు అధికారులు. ఈ సంఘటన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

దిల్లీ కోర్టులో 13 రామచిలుకలను ప్రవేశపెట్టారు అధికారులు. చిలుకలను కోర్టుకు తీసుకురావడమేంటని అనుకుంటున్నారా.. అయితే చిలుకలు తప్పేం చేయలేదు. వాటిని అక్రమంగా వేరే దేశానికి తరలిస్తున్న వ్యక్తితో పాటుగా కోర్టుకు తీసుకొచ్చారు సీఐఎస్​ఎఫ్​​ అధికారులు.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చెప్పులు ఉంచే అట్టపెట్టెల్లో చిలుకలను ఉంచి... అధికారుల కళ్లుకప్పి గుట్టుగా తమ దేశానికి తీసుకుపోదాం అనుకున్నాడో వ్యక్తి . అతని ప్రయత్నం బోల్తాకొట్టి భద్రతాధికారుల తనిఖీల్లో దొరికిపోయాడు. నిందితుడిను అదుపులోకి తీసుకుని, చిలుకలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు 'చిలుకలను ఓ దుకాణంలో కొనుగోలు చేశానని, ఉజ్బెకిస్థాన్​లో చిలుకలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వాటిని అక్రమంగా తరలిస్తున్నట్లు' వెల్లడించాడు.

నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​ను న్యాయస్థానం తిరస్కరించింది. అక్టోబర్ 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చిలుకలను ఓక్లా పక్షుల సంరక్షణ కేంద్రంలో ఉంచాలని అధికారులను ఆదేశించింది కోర్టు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..