మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి

ముంబై: 

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వీరసావర్కర్‌కు భారతరత్న ఇస్తామని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొనడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

అయితే ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పు పట్టారు. 

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని, ఇప్పుడు అదే వైఖరిని సావర్కర్‌పై చూపిస్తుందని మోదీ అన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అకోలాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. 

‘‘వీర సావర్కర్ జాతీయతను నేర్పించిన వారు. ఆధునిక భారతానికి సంస్కారం నేర్పిన వారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోంది. కాంగ్రెస్‌కు ఇది అలవాటే. 

రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించింది. 

ప్రస్తుతం సావర్కర్ విషయంలోనూ ఇదే చేస్తోంది’’ అని అన్నారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..