ఉష్ణోగ్రత ఎంత పెరగవచ్చు .....?

భూ ఉపరితల ఉష్ణోగ్రత 1850‌తో పోల్చితే 21వ శతాబ్దం చివరినాటికి 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగొచ్చు. చాలా వరకూ అంచనాలు ఇదే సూచిస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైనా కొనసాగితే పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీ‌గ్రేడ్‌లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది.

ఉష్ణోగ్రతలో 2 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు, నాయకులు అంటున్నారు.

ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌లకు అదుపు చేయాలంటే సమాజం అన్ని విధాలుగా త్వరితగతిన మారాల్సి ఉంటుందని ఇంటర్‌గవర్న్‌మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) నివేదిక అభిప్రాయపడింది.

గ్రీన్ హౌజ్ ఉద్గారాల కట్టడి విషయంలో రాజకీయంగా జరుగుతున్న కృషికి ఐరాస నేతృత్వం వహిస్తోంది.

చైనా నుంచే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి.

ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే, వీటిలో ఉద్గారాలు చాలా ఎక్కువ.

ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గించుకున్నా, వాతావరణంపై ప్రభావం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..