గ్లోబల్ వార్మింగ్‌కు ఆధారాలు ....


శిలాజ ఇంధనాలను మండించడం వల్లే అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే అడవులను నరికి, కాల్చేయడం వల్ల కూడా కార్బన్ వెలువడుతోంది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతోంది.

1750లో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు 30 శాతం పెరిగాయి. గత 8 లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డై ఆక్సైడ్ ఎప్పుడూ లేదు.

మనుషుల చర్యల వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు కూడా వెలువడుతున్నాయి. అయితే, కార్బన్ డై ఆక్సైడ్ అంతటి స్థాయిలో అవి లేవు.


గ్లోబల్ వార్మింగ్‌కు ఆధారాలు ఉన్నాయా?

పారిశ్రామిక విప్లవం కన్నా ముందునాళ్లతో పోల్చితే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) చెబుతోంది.

అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన 20 ఏళ్లు.. గత 22 ఏళ్లలోనే ఉన్నాయి.

2005-2015 మధ్య సగటు సముద్ర మట్టం 3.6 మిల్లీమీటర్లు పెరిగింది.

ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీరు వ్యాకోచించి ఇది ఎక్కువగా జరిగింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..