హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్...!

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించటం కోసం సరి - బేసి విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదననను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తుంది. ఐటీ కారిడార్ లో భవిష్యత్తులో ఏర్పడే ముప్పును నియంత్రించటానికి పలు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. నిన్న ఈ అంశం గురించి అధికారులు 100 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.


కొత్తగా వస్తున్న కంపెనీలు, పెట్టుబడులు, నిర్మాణాలు, కాలుష్యం, వాహన రద్దీ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సరి - బేసి విధానంలో వాహనాలను అనుమతించటంతో వాహన రద్దీని తగ్గించాలనే అంశం గురించి చర్చించినట్లు సమాచారం.

కార్ పూలింగ్ విధానం ద్వారా రహేజా పార్కు - రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్క్ - ఐకియా మార్గాల్లో కార్ల రద్దీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను పెంచాలనే ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ - విప్రో సర్కిల్ వరకు బీ ఆర్ టీ ఎస్ మార్గాన్ని వేగంగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీల ప్రతినిధులు కార్ పూలింగ్ ప్రోత్సహిస్తే కార్లు ఎక్కువవుతాయని కొందరు చెప్పగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచటం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని కొందరు చెప్పినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచటం ద్వారా కార్లు, ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గుతుందని ఐటీ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. కోకాపేటలో బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఇంఫాక్ట్ ఫీజు పెంచాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పార్కింగ్ స్థలాల్లో ఫీజులను పెంచటం ద్వారా కార్ల రద్దీని తగ్గించవచ్చని అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..