షాకింగ్ న్యూస్: చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్.. జైలు కూడా!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మరిన్ని మార్పులు తీసుకొస్తున్నారు. అవి వాహనదారులకు ఉపశమనం కలిగించేలా లేవు. రోడ్లమీదకు రావాలంటే వణుకు పుట్టిస్తున్నాయి. టూ-వీలర్స్ నడిపేటప్పుడు వాహనదారులు స్లిప్పర్స్ వంటివి వాడకూడదట. ఈ రూల్‌ను నిర్లక్ష్యం చేసి చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే.. వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సిందే.

అక్కడితో అయిపోలేదు. మొదటిసారి చెప్పుల్లేకుండా డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు.. అదే రెండో సారి కూడా చేస్తే 15రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. నవభారత్ టైమ్స్ ఆగష్టులో తెలిపిన వివరాల ప్రకారం.. రూల్ ఇప్పటికే ఉన్నా కొన్ని ప్రదేశాల్లో తప్పనిసరిగా పాటించాలని నిబంధనలు విధించడం లేదని తెలిపింది.

ట్రాఫిక్ నియమాల ప్రకారంగా..చెప్పులు లేదా శాండిల్స్ వేసుకుని టూవీర్స్ నడపడం నేరం కిందకు వస్తుందని..దీనికి ఫైన్ కూడా ఉంటుందనీ వార్తలు వస్తున్నాయి. కాగా..ఈ నిబంధన కూడా వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని సమాచారం. చెప్పులు, లేదా స్లీపర్స్ వేసుకుని వాహనం నడిపే వారికి రూ. 1000 జరిమానా విధిస్తారు. అలా మరోసారి కూడా పట్టుబడితే 15 రోజుల పాటు జైలుశిక్ష విధిస్తారట.

కాగా..యూపీలో మరో కొత్త రూల్ ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటోంది లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ వార్తలు..నిబంధనలతో ప్రజల జేబులు మాత్రం ఖాళీ అయిపోతున్నాయి. మరోపక్క ఇంత భారీగా ఫైన్లు వేస్తున్న ప్రభుత్వం రోడ్ల పరిస్థితిని మాత్రం పట్టించుకోవటంలేదనే విమర్శలు వస్తున్నాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..