మందు అమ్ముతాం

మందు అమ్ముతాం :

సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం పీజీ విద్యార్ధులు బారులు:

ఎమ్మెల్యేలకు గిరాకీ..!!

మద్యం అమ్మేందుకు పట్టభద్రులు..పోస్టు గ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్నారు.

అక్టోబర్ నుండి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం దుకాణాలను నిర్వహించనుంది.

ఇందుకోసం సేల్స్ మెన్ .. సూపర్ వైజర్లు నియామకం ప్రారంభించింది.

ఈ పోస్టుల కోసం అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసారు.

ఉన్నత విద్యా వంతులు సైతం ఈ పోస్టులు దక్కించుకోవటానికి పోటీ పడుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెస్తున్నారు.

సచివాయల పోస్టుల పరీక్షలు పూర్తయ్యాయి.

ప్రశ్నా పత్రాలు కఠినంగా ఉన్నాయని చెబుతున్న అభ్యర్దులు ఇప్పుడు మందు అమ్మటానికి సైతం ముందుకు వచ్చారు.

దీంతో.. ఇప్పుడు ఏపీలో సచివాలయ పోస్టులకే కాదు..మద్యం అమ్మకాల పోస్టులకు డిమాండ్ పెరిగింది.

ఇదే సమయంలో మద్యం దుకాణాల్లోని పోస్టులను రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భారీగా ముడుపులు తీసుకుని కొందరికి కేటాయించేశారని,

అందుకే తమకు సమాచారం కూడా కొందరు అభ్యర్దులు పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెద్ద సంఖ్యలో విడుదల చేసిన పోస్టుల్లో సచివాలయ ఉద్యోగాల కోసం తాము ఎటువంటి సిఫార్సులు చేయలేమని

మంత్రులు..ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు.

ఇక, కనీసం మద్యం దుకాణాల్లో ఉద్యోగాల కోసమైనా తమకు సిఫార్సు చేయాలంటూ వారి కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నాయకుల నుండి ఒత్తిడి పెరుగుతోంది.

దీంతో.. అనేక మంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

మొత్తంగా ఈ వ్యవహారం చివరి నిమిషం వరకు ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..