క్రికెట్ వరల్డ్ కప్ 2019: ఇండియాతో మ్యాచ్‌కు ముందు పాక్ పరిహాసం... భారత పైలట్‌ మీద వ్యంగ్యంగా టీవీ యాడ్


పాకిస్తాన్ టెలివిజన్ రూపొందించిన అడ్వర్టైజ్‌మెంట్‌లోని నటుడు.. అభినందన్ తరహాలో గుబురు మీసాలతో, భారత క్రికెట్ జెర్సీ ధరించి కనిపిస్తాడు.

ఈ వీడియోలో తనను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి ఆయన నిరాకరిస్తాడు.

కానీ ఈ వీడియోలో.. రాబోయే భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ గురించి ప్రశ్నలు అడుగుతారు.

భారత జట్టులో ఎవరెవరు ఉంటారు?' వంటి ప్రశ్నలు అడుగుతారు.

ఒక టీ కప్పుతో టీ తాగుతున్న నటుడు అభినందన్ తరహాలో 'క్షమించండి.. ఆ వివరాలు నేను చెప్పకూడదు' అని బదులిస్తాడు.

అనంతరం అతడిని విచారణ నుంచి వెళ్లిపోవచ్చని చెప్తారు.

అతడు వెళ్లిపోతుంటే మళ్లీ ఆపి చేతిలో ఉన్ కప్‌ను ఇచ్చి వెళ్లాలని నిర్దేశిస్తారు. క్రికెట్ ప్రపంచ కప్‌ ట్రోఫీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అది.

భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఇటీవల జరిగిన తీవ్ర ఉద్రిక్త సంఘటనను వ్యంగ్యంగా మలచి క్రికెట్‌కు అన్వయించిన అడ్వర్టైజ్‌¿మెంట్ ఇది.

ఈ యాడ్ భారత్‌లో చాలా మందికి ఆగ్రహం తెప్పించింది.

ఈ రకంగా యాడ్ తయారుచేసి ప్రసారం చేయటం ''సిగ్గుచేటు'' అని, ''మూర్ఖత్వం'' అని సోషల్ మీడియాలో చాలా మంది మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?