ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..


హైదరాబాద్ నగరానికి చెందిన భార్యాభర్తలు. పెళ్లయి రెండేళ్లయింది. ఇద్దరు మాదాపూర్ లోనే వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది.ఉదయాన్నే ఇద్దరు ఎవరి ఆఫీసుకు వాళ్లు వెళ్లేవారు. సాయంత్రానికి ఇంటికి చేరుకుని ఎలాంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తున్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకున్నా రెండేళ్ల దాంపత్యం జీవితం వాళ్లకు రొటీన్‌గా అనిపించింది.
డిఫరెంట్ లైఫ్ కావాలని ఉబలాటపడ్డారు. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. చీటికీ మాటికి చికాకులు... చిన్న చిన్న విషయాలకు గొడవలు మొదలయ్యాయి. ఏమిటీ జీవితం అనుకుంటూ ఇద్దరూ జీవితాన్ని బలవంతాగానే ముందుకు సాగిస్తున్నారు.

ఓ రోజు బార్య కు ఓ కొంటె ఆలోచన వచ్చింది. తన పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసింది. అందంగా సెక్సీగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టింది. కాస్త బోల్డ్‌గా కామెంట్స్ చేస్తూ పిక్స్ కూడా షేర్ చేయడం ప్రారంభించింది. దీంతో తన ఫేస్బుక్ అకౌంట్‌కు కుప్పలు తెప్పలుగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వచ్చి పడ్డాయి.వాటిలో తనకు నచ్చిన ప్రొఫైల్స్ యాక్సెప్ట్ చేస్తూ ఎప్పటికప్పుడూ క్లియర్ చేస్తోంది. తన అకౌంట్‌‌కు
వస్తున్న కామెంట్లు, లైక్‌లకు ఉబ్బితబ్బిబ్బవుతూ రిప్లై కామెంట్లు చేస్తోంది. రాత్రీ పగలు తేడా లేకుండా అలా టైం పాస్ చేస్తోంది.

రాత్రి పూట భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా ఫేస్‌బుక్‌తోనే కాలం గడుపుతోంది. భర్త కూడా పెద్దగా పట్టించుకోలేదు. తను కూడా తనతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆంక్షలు పెట్టడం సరికాదు అనుకున్నాడు. ఎలాంటి దురుద్ధేశాలకు పోకుండా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు.ఒకరోజు తన అకౌంట్‌కు ఒక పేరుతో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ప్రొఫైల్ చెక్ చేసింది. ప్రొఫైల్ పిక్ స్టైల్‌గా, స్మార్ట్‌గా ఉంది. తన పేరు, హైదరాబాద్ బేస్ట్ బిజినెస్‌మెన్ అని ఉంది. ప్రొఫైల్ కొంచెం స్పెషల్‌గా అనిపించింది. యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన మరు క్షణమే “థాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్.వియార్ ఫ్రెడ్స్ నౌ” అని మెసేజ్ వచ్చింది. అతడి చొరవకు ఒకింత ఆశ్చర్యపడింది. థమ్సప్ సింబల్‌తో “యస్... వుయార్ ఫ్రెండ్స్” అని రిప్లై ఇచ్చింది.మర్నాటి నుంచి ఇద్దరు ఫేస్బుక్‌లో చాటింగ్ మొదలుపెట్టారు. పరిచయాలతో ప్రారంభమైన చాటింగ్ కబుర్ల వరకు వెళ్లింది. అతడి సెన్సాఫ్ హ్యూమర్ తనకి బాగా నచ్చింది. ఆఫీసు పనిలో బిజీగా ఉన్నా మొబైల్ ఫోన్ పై ఓ కన్నేసి ఉంచేది. రేయింబవళ్లు తేడా లేకుండా చాటింగ్‌లో మునిగితేలుతున్నారు. అతడి ధ్యాసలో పడి తను అసలు భర్తను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. తనకు పెళ్లియిన విషయాన్ని కూడా అతడి వద్ద దాచిపెట్టింది.

అలా నెల రోజులు గడిచాయి. అతడు చొరవ తీసుకొని “ఎన్నాళ్లీ చాటింగ్... నీ కోయిల గొంతు వినిపించవా” అని అడిగాడు. ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాడు. తను సరే అంటు నంబరు ఇవ్వబోతూ ఒక్క క్షణం ఆగింది. ఇప్పుడు వద్దులే... ఈ నంబరుకు ఆఫీసు కాల్స్, ఇంటి వాళ్ల కాల్స్ వస్తాయి. కొత్త నంబరు తీసుకొని ఇస్తానంది. అతడు సరే అన్నాడు.మర్నాడు కొత్త నంబరు తీసుకొని అతనికి షేర్ చేసింది. వెంటనే తన ఫోన్ మోగింది. హలో అంటూ పలకరించింది. “అబ్బా... నెల రోజులకు నీ గొంతు వింటున్నాను. ఐయామ్ హాపీ” అంటూ మాటలు కొనసాగించాడు. ఫేస్బుక్ చాటింగ్‌లో బిజీగా ఉండే తను, అతని ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు.

బిజినెస్ మీటింగుల్లో బిజీగా ఉన్నా వాటన్నింటిని పక్కనబెట్టి నీతో మాట్లాడాలనిపిస్తోందని చెప్పెవాడు. తను పొంగిపోయింది. ఇద్దరి మధ్య తెలియకుండానే ఓ అనుబంధం ఏర్పడింది. మాట్లాడుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదని పరిస్థితి. ఇంతలో అతను ఓ రోజు “ఐ లవ్ యూ.. ఐ వాంట్ టు మ్యారీ యూ” అని మెసేజ్ పెట్టాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతనికి కాల్ చేసి “ఈ మాట చెప్పడం కోసం ఇన్ని రోజులు ఆగాలా... నువ్వు ఎప్పుడు చెబుతావా అని వెయిట్ చేస్తున్నాను” అంది. అలా చాటింగ్‌లో మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది.

ఇద్దరూ కలుద్దాం అనుకున్నారు. ఓ రోజు ఆఫీస్ లంచ్ టైంలో మదాపూర్ లోని ఓ రెస్టారెంట్ లో కలుద్దాం అనుకున్నారు. తను అనుకున్న రెస్టారెంట్‌కు అతని కంటే ముందుగా చేరుకుంది. కిటికీ పక్కన కూర్చొని మాటిమాటికి ఫోన్ వైపు చూస్తూ అతను ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తోంది. ఫోన్ చేస్తే అతను ట్రాఫిక్ లో ఉన్నాను ఐదు నిమిషాల్లో నీ ముందుంటాను అని చెప్పాడు. అలా కొన్ని నిమిషాలు గడిచాయి. కిటికీ లోంచి చూస్తూ తన భర్త అటుగా వెళ్లడం గమనించింది. తనకు ఒక్క సారిగా ఊపిరి ఆగినంత పనయింది. భర్త  తనను అతనితో  చూస్తే ఇంకేమైనా ఉందా అనుకొని వెంటనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయింది.ఇంతలో అతను తనకు కాల్ చేసి “నేను రెస్టారెంట్ లో ఉన్నాను. నువ్వెక్కడున్నావ్.” అన్నాడు. తను బదులిస్తూ... ఆఫీస్ నుంచి అర్జెంట్ వర్క్ ఉందని ఫోను వచ్చింది... వెళ్లక తప్పలేదు అని చెప్పింది. అతను “ఓకే కూల్... విల్ మీట్ నెక్స్ట్ టైం” అన్నాడు. తను ఊపిరి పీల్చుకుంది. గండం గట్టెంక్కింది అనుకుంది.

మరో వారం తర్వాత మళ్లీ కలుద్దామనుకున్నారు అతను, తను. ఈ సారి మాదాపూర్ లో కాకుండా జూబ్లీహిల్స్ 45లోని ఓ రెస్టారెంట్ లో కలుద్దామనుకున్నారు. ఈ సారి అతను ముందుగా అక్కడికి చేరుకున్నాడు. ముందుగా రిజర్వు చేసుకున్న ప్రైవేట్ టేబుల్ (ప్రత్యేక రూం) లో కూర్చున్నాడు. తనకు కాల్ చేస్తే ఫైవ్ మినెట్స్ అంది.ఈ లోపు వాష్ రూంకు వెళ్లి ఫ్రెషప్ అయ్యాడు. ఇంతలో ఫోన్ మోగింది.ఎక్కడ డియర్ నేను వచ్చేశాను అంది తను. వన్ మినెట్ వాష్ రూంలో ఉన్నాను. వస్తున్నాను. అంటూ ఫోన్ లో మాట్లాడుతూనే తన టేబుల్ వైపు నడిచాడు అతడు. గది తలుపు తీసి లోపలికి వెళ్లబోయాడు. గదిలో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు అతడు. తనకు గుండె ఆగినంత పనయ్యింది. రెస్టారెంట్ లో తన కోసం వెయిట్ చేస్తోంది ఎవరో కాదు... తన భార్య అని. అతను ఎవరో కాదు భర్త . తను పేరు మార్చుకొని ఫేక్ ఐడీ క్రియేట్ చేసినట్టే అతను కూడా వెరె పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు.

రెస్టారెంట్‌లో ఒకరినొకరు చూసుకొని నిర్ఘాంతపోయారు. మాటల్లేవ్... ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్ధం రాజ్యమేలింది. కొన్ని క్షణాల తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. సాయంత్రం ఇద్దరు భయంభయంగా ఇంటికి చేరుకొని ఎవరి మానానా వారు ఉంటున్నారు. ఇద్దరు తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నారు.బంగారం లాంటి కాపురం కాదనుకొని మరేదో కావాలని ఆశపడి ఫేస్బుక్ లో ఫేక్ ఐడీతో ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ఇప్పుడు కుంగిపోతున్నారు. వీరిలో తప్పెవరిది.. ఫేస్ బుక్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన తనదా.... అందమైన అమ్మాయి కదా అని మరో ఫేక్ ఐడీతో వల వేసిన అతనిదా...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?