మరికొన్ని గంటల్లో కన్నడనాట బలపరీక్ష..ఆలోచనలో పడ్డ బీజేపీ సభ్యులు

బెంగళూరు: 

ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం గురువారం 11గంటలకు శాసనసభలో బలనిరూపణ జరగాల్సి ఉండేది.

అందుకు సంకీర్ణ సర్కారు నడుపుతున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌లతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు.

ఈ సందర్భంగా బలనిరూపణ తర్వాత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పదని యడ్యూరప్ప బహిరంగ ప్రకటన చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలు బస చేస్తున్న రమణ రిసార్ట్‌కు చేరుకున్న యడ్యూరప్ప సుమారు రెండున్నర గంటలకు పైగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

శాసనసభలో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా సభ్యులెవరూ ఆవేశపడకూడదని అంతకుమించి దూకుడుగా మాట్లాడరాదని దిశానిర్దేశం చేశారు.

సభలో వివాదం చెలరేగేలా చేసి బీజేపీ సభ్యులపై వేటు వేయించి తాత్కాలికంగా సర్కార్‌ను కాపాడుకునే యత్నంలో సంకీర్ణ సర్కార్‌ ఉందని యడ్యూరప్ప తెలియజేయడంతో బీజేపీ సభ్యులు ఆలోచనలో పడ్డారు.

సభలో మెజార్టీ మినహా మరో ప్రస్తావన తీసుకురాకుండా ముందుకు వెళదామని యడ్యూరప్ప సభ్యులకు వివరించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..