చేదు అనుభవం : నడిరోడ్డుపై ఆమెను ఆపి.. ఆ పెద్దాయన ఏం చేశాడంటే..

ఆఫీస్‌లో విధులు ముగించుకుని ఆమె హాస్టల్‌కు బయలుదేరింది. రోడ్డుపై నడుస్తుండగా ఒక పెద్దాయన ఆమెను పిలిచాడు. దగ్గరికి వచ్చి.. నీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉందా? అని అడిగాడు.ఉందని ఆమె బదులిచ్చింది. ముంబైలో ఓ భవంతి కూలిపోయి చాలామంది చనిపోయారు కదా.. ఒకసారి గూగుల్‌లో ఆ న్యూస్ చూపించవా అని అడిగాడు. పాపం.. అందులో ఆ పెద్దాయనకు సంబంధించనవారు ఎవరైనా ఉన్నారేమో అనుకుంది. గూగుల్‌లో సెర్చ్ చేసి ఆ న్యూస్‌ను చూపించింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. ఆ తర్వాతే ఆ పెద్దాయన అసలు స్వరూపం బయటపడింది.

కాసేపటికి.. ఆ న్యూస్ క్లోజ్ చేసి తిరిగి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లమని అడిగాడు. ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాలేదు.. కానీ అతను చెప్పినట్టే చేసింది. అప్పుడు అడిగాడు.. ఇందులో 'హెచ్‌డి ఫోన్' వస్తాయా? అని.. అతని ప్రశ్న ఆమెకేమీ అర్థం కాలేదు. దీంతో ఆమె చేతిలో నుంచి ఫోన్ తీసుకుని 'hdporn' అని టైప్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆమెకు నిజంగా షాక్ తిన్నంత పనైంది. ముంబైకి చెందిన ఓ మహిళకు మంగళవారం ఈ అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఆ పెద్దమనిషి అలా చేయడంతో.. ఫోన్ లాక్కుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్లిపోయినట్టు తెలిపింది. అతని వయసు దాదాపు 55-60 ఉంటుందని తెలిపింది. పెద్ద మనిషి అయి ఉండి.. ఓ అమ్మాయిని రోడ్డుపై ఆపి మరీ ఇలా చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్విట్టర్‌లో దీనిపై ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పటికే వైరల్‌గా మారింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..