నేపాల్ దేశంలో గత 8 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. 

ఖాట్మండు :

నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరదనీరు జనవాసాలను ముంచెత్తింది. 

నేపాల్ దేశ వ్యాప్తంగా వచ్చిన వరదల్లో మరణించిన వారి సంఖ్య 88 కి పెరిగింది. మరో 31 మంది ప్రజలు వరదల్లో చిక్కుకొని గల్లంతు అయ్యారని నేపాల్ హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. 

వరదల్లో చిక్కుకున్న 3,366 మందిని నేపాల్ సైనికులు, పోలీసులు రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నేపాల్ పోలీసులు, ఆర్మీ, అగ్నిమాపకశాఖ అధికారులు రంగంలోకి దిగి వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..