40 ఫీట్ల లోతు బావిలో పడిన పిల్లి కూన... సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీమ్

ఓ 40 ఫీట్ల లోతు బావిలో ఓ పిల్లి కూన జారిపడింది. సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందం సురక్షితంగా బయటికి తీసింది. వివరాల్లోకి వెళితే.. మల్కాజ్‌గిరి లోని సీతారాం నగర్ బావిలో రెండు పిల్లి పిల్లలు గత మూడు రోజుల క్రితం పడ్డాయని వెలికితీసేందుకు సహాయం చేయాలని స్థానిక మహిళ జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ ఎఫ్ బృందాలకు సమాచారం అందించింది. అయితే గత మూడు రోజుల క్రితమే ఈ పిల్లి పిల్లలను రక్షించాలని పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థకు ఫోన్ చేసిన వారు స్పందించ లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సఫిల్ గూడా.. సీతారాం నగర్ లోని బావి వద్దకు చేరుకున్నాయి. 40 అడుగుల లోతు ఉన్న బావిలో డి ఆర్ ఎఫ్ సిబ్బంది దిగి బొక్కెన ద్వారా పిల్లి పిల్లను సురక్షితంగా బయటకు తీశారు. రెండు పిల్లి పిల్లలను సురక్షితంగా వెలికి తీయడం పట్ల జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలను స్థానిక ప్రజలు,, జంతు ప్రేమికులు అభినందనలతో ముంచే్త్తారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..