రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు

*అమరావతి*

కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం

భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం

భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదం

మద్య నిషేధం దిశగా తొలిఅడుగు, తొలిదశ చర్యలు ప్రారంభం
ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ, మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్

ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే, కేబినెట్ ఆమోద ముద్ర
గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ఆమోదముద్ర

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కుకోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం  విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం

అంగన్ వాడీ వర్కర్లకు రూ.11,500, మిని అంగన్ వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్ వాడీ హెల్సర్ కు రూ.7వేలు జీతాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం

జులై నుంచి పెంపుదల వర్తింపు
పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కేబినెట్ ఆమోదం

ప్రభుత్వ వ్యవస్థలను ప్రతి గ్రామం ముంగిటకు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమన్న కేబినెట్
ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ నియామకానికి మంత్రివర్గం ఆమోదం
వీరికి నెలకు రూ.5వేలు ఇచ్చేందుకు అంగీకారం, పంచాయతీరాజ్ శాఖకు గ్రీన్ సిగ్నల్
పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా వ్యవస్థకు కేబినెట్ ఆమోదం

దేవాదాయ శాఖ చట్టంలో మార్పులకు ఉద్దేశిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..