మరో వంద రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్‌) పరిధిలోని అన్ని స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది.

హైదరాబాద్

జోన్‌లో మొత్తం 753 స్టేషన్లు ఉండగా.. ఇప్పటికే 207 స్టేషన్లలో వైఫై అందుబాటులో ఉంది.

ఇందులో ఏ 1, ఏ కేటగిరీల్లోని 36 మేజర్‌ స్టేషన్లు, బీ, సీ, డీ, ఈ కేటగిరీల్లోని మరో 171 మైనర్‌ స్టేషన్లు ఉన్నాయి.

మరో 76 స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రైల్‌ వైర్‌ పేరుతో అందిస్తున్న వైఫై సేవలను రానున్న వంద రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరించనుంది.

కాగా, ఎస్సీఆర్‌ పరిధిలో ఈ ఏడాది మే నెలలో 10 లక్షల మంది ప్రయాణికులు వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోగా, హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, గుంతకల్‌ స్టేషన్లలో వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు.

దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం లక్షలమంది ప్రయాణికులు వైఫై వినియోగించుకుంటున్నారని జీఎం గజానన్‌ మాల్యా వెల్లడించారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..