శివ కోటి గ్రామంలో జరుగుతున్న నేషనల్‌ హైవే పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరిశీలించారు.

రాజోలు : 

శివ కోటి గ్రామంలో జరుగుతున్న నేషనల్‌ హైవే పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరిశీలించారు. హైవే ఎలైన్మెంట్‌ వల్ల బ్రిటీష్‌ వారి కాలంలో కట్టిన శివ కోటి లాకుకు ముప్పు వాటిల్లుతుందని జలవనరుల శాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. దీంతో కలెక్టర్‌ ప్రత్యేకంగా శివకోటి లోని ఇంగ్లాండ్‌ వాటర్‌ బేస్‌ ను పరిశీలించారు. లాకుల మీద నుండి హైవే రోడ్డు వెళ్లడం వల్ల ఇరిగేషన్‌ సిస్టం కు నష్టం వాటిల్లుతుందని, ఆయకట్ట పాడవుతుందని ఇరిగేషన్‌ అధికారులు కలెక్టర్‌ కు వివరించారు. ఈ ఆయకట్టు ద్వారా 17 వేల ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందని, లాకు నుండి హైవే రోడ్డు వెళితే రైతులు సహితం ఇబ్బందులకు గురువుతారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. హైవే రోడ్‌ పనులు నాలుగు ప్యాకేజీల్లో జరుగుతున్నాయన్నారు. మొదటి, రెండు ప్యాకేజీలు సజావుగా జరిగాయని, మూడు, నాలుగు ప్యాకేజీలకు అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. శివకోటి లోని ఇంగ్లాండ్‌ వాటర్‌ బేస్‌ కు సంబంధించి ఇరిగేషన్‌, నేషనల్‌ హైవే అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ వెంట అమలాపురం ఆర్‌డిఒ బివి.రమణ, ఇరిగేషన్‌ సిఇ శ్రీధర్‌, ఎస్‌ఇ కృష్ణారావు, ఇఇ రఘు బాబు, డిఇ శ్రీనివాసరావు, నేషనల్‌ హైవే ఎఇ వెంకట రమణ, అమలాపురం డిఎస్పీ ఆర్‌.రమణ, తదితరులు ఉన్నారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..