కాసేపట్లో ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: 

మరికాసేపట్లో ఆరో రోజు ఏపీ అసెంబ్లిస సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ప్రశ్నోత్తరాలతో ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణంలో పనులు నిలిపివేత ఆర్డినెన్స్‌పై సభలో టీడీపీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఆశావర్కర్లకు జీతాల పెంపు, నదులు, కాల్వలపై కట్టడాల నిర్మాణం, ధాన్యం సేకరించిన రైతులకు నగదు చెల్లించక పోవడంపై టీడీపీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక ఉద్దరణ, నక్కపల్లి పీహెచ్‌సీ స్థాయి పెంపు, నర్సాపురంలో కొత్త ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణంపై వైసీపీ ప్రశ్నలు అడగనుంది.

నేటి నుంచి బడ్జెట్‌ కేటాయింపులు, డిమాండ్లపై ఓటింగ్‌ జరగనుంది. రోడ్లు భవనాలు, నీటి పారుదల, అటవీ పర్యావరణం విద్యుత్‌శాఖపై ఓటింగ్‌ జరగనుంది.

ఉన్నత విద్యామండలిలో అవకతవకలు, జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఖర్చు చేసిన నిధులపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలలో చర్చ జరగనుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..