రైతుల జీవితాల‌ను బ‌లోపేతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నదీ

లోక్ సభ

రైతుల జీవితాల‌ను బ‌లోపేతం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ తెలిపారు.

లోక్‌స‌భ‌లో ఆయ‌న ఇవాళ మాట్లాడారు. పీఎం కిసాన్ ప‌థ‌కంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంద‌ని మంత్రి చెప్పారు. భూమి ఉన్న రైతుల‌కు మాత్ర‌మే ఈ స్కీమ్ వ‌ర్తిస్తుంద‌న్నారు.

ఆవాస్ యోజ‌న ద్వారా ఇళ్లులేని వారి ల‌బ్ధి పొంద‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఎటువంటి నివాస ప్రాంతం లేనివారు ఈ స్కీమ్ కింద సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లును సొంతం చేసుకుంటున్నార‌ని మంత్రి చెప్పారు.

నిరుప‌యోగ భూములు ఉన్న రైతుల‌కు ఊత‌మివ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఆ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్ల‌ను ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. అలాంటి రైతుల నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తామ‌న్నారు.

గ్రామీణ వికాసం అంశంపై సుమారు 9 గంట‌లు చ‌ర్చ జ‌రిగిన‌ట్లు మంంత్రి తోమ‌ర్ చెప్పారు.

గ్రామీణ రోడ్ల విస్త‌ర‌ణ రెండో ద‌శ‌లో 50వేల కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు.

దాంట్లో ఇప్ప‌టికే 31వేల కిలోమీట‌ర్ల రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యింద‌న్నారు.

మూడ‌వ ద‌శ‌లో సుమారు ల‌క్ష‌న్న‌ర కిలోమీట‌ర్ల రోడ్ల విస్తీర్ణం ఉంటుంద‌ని మంత్రి తోమ‌ర్ చెప్పారు.

మ‌న్రేగా స్కీమ్ కోసం 12 కోట్ల కార్డులు జారీ చేశామ‌ని, దాంట్లో 11 కోట్ల కార్డుల‌కు ఆధార్ అనుసంధాన‌మైంద‌న్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..