దేశంలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న వారిని అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్ర‌కారం వారివారి దేశాల‌కు అప్ప‌గిస్తాం

రాజ్యసభ

దేశంలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న వారిని అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్ర‌కారం వారివారి దేశాల‌కు అప్ప‌గిస్తామ‌ని కేంద్ర హోంశాఖ‌మంత్రి అమిత్ షా తెలిపారు.

ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్ఆర్‌సీ చ‌ర్య‌ను కేవ‌లం అస్సాంకు మాత్ర‌మే నిర్వ‌హించ‌డం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం అస్సాం ఒప్పందం ప్ర‌కారం అక్క‌డ ఎన్ఆర్‌సీ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ప్ర‌కారం, దేశంలో ఉన్న ప్ర‌తి అక్ర‌మ శ‌ర‌ణార్థిని వెళ్ల‌గొడుతామ‌ని మంత్రి తెలిపారు.

జూలై 31వ తేదీన అస్సాంకు చెందిన తుది ఎన్ఆర్‌సీ జాబితాను రిలీజ్ చేయ‌నున్నారు.

రోహింగ్యా ముస్లింలు ఇండియాలో ఎంత మంది ఉన్నార‌న్న దానిపై క‌చ్చిత‌మైన డేటా లేద‌ని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.

ఆల‌స్యం జ‌రిగినా.. ఎటువంటి లోపాలు లేకుండా ఎన్ఆర్‌సీ నిర్వ‌హిస్తామ‌న్నారు.

దేశంలో అక్ర‌మంగా ఉంటున్న విదేశీయుల‌ను ఏరివేసేందుకు విదేశీ ట్రిబ్యున‌ల్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..