టిక్‌ టాక్ లాంటి మరిన్ని యాప్స్... ఇండియాలో ప్రవేశపెట్టబోతున్న బైట్‌డాన్స్

టిక్ టాక్ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ ఇండియాలో ఎలా దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని మెయింటేన్ చేస్తున్నది చైనా కంపెనీ బైట్ డాన్స్ అని చాలా మందికి తెలియదు. టిక్ టాక్‌కి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల మంది యూజర్లు ఉండగా... వారిలో ఎక్కువ మంది చైనీయులు, ఇండియన్సే. ఐతే... ఇది చైనా యాప్ అని తెలిస్తే... ఇండియాలో దీన్ని పక్కన పెడతారనే వాదన బలపడుతోంది. పైగా... ఈ యాప్‌పై ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. దీని వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారనీ, విద్యార్థులు చెడిపోతున్నారనీ... ఆరోపణలున్నాయి. ఈ యాప్‌ని ఇండియాలో నిషేధించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. అందుకే బైట్ డాన్స్ కంపెనీ... టిక్ టాక్ లాంటివే... ఇండియాకి సంబంధించి... కొన్ని యాప్స్ తయారుచేయిస్తున్నట్లు తెలిసింది. అవి టిక్ టాక్‌కి ఇండియన్ వెర్షన్‌లా ఉంటాయి. అందువల్ల వాటిపై చైనా యాప్స్ అనే ముద్ర పడదు.

ప్రస్తుతం ఇండియాలో స్టార్టప్స్ ప్రారంభించేందుకు చాలా చైనా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్న బైట్ డాన్స్... ఇప్పటికే గురుగ్రాం, ముంబై, బెంగళూరులో... తమ స్టార్టప్‌లను మెయింటేన్ చేస్తోంది. 2016లో ప్రారంభించిన డైలీ హంట్ న్యూస్ యాప్ కోసం రూ.170 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. త్వరలో మరిన్ని స్టార్టప్‌ల ద్వారా దేశమంతా విస్తరించాలనుకుంటోంది. సోషల్ కామర్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్లేందుకు ప్లాన్స్ వేస్తోంది.

2012లో చైనాలో ప్రారంభమైన బైట్ డాన్స్... 2017 సెప్టెంబర్‌లో ఇండియాలోకి అడుగుపెట్టింది. విగో వీడియో లైవ్ స్ట్రీమింగ్ యాప్ ప్రారంభించింది. గతేడాది ఆగస్టులో టిక్ టాక్ ద్వారా ఇండియా సోషల్ మీడియా మార్కెట్‌పై తుఫానులా విరుచుకుపడింది. అదే సమయంలో... లోకల్ లాంగ్వేజ్‌లో సోషల్ మీడియా యాప్ గహెల్, షేర్ చాట్ క్లోన్ ప్రారంభించింది. చైనాలో కూడా 8 యాప్స్ నిర్వహిస్తున్నా... ఇండియాలో ఈ సంస్థ ఎక్కువ విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..