జగన్ సర్కారుకు వరల్డ్ బ్యాంక్ తీపి కబురు!

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేసిన ప్రపంచ బ్యాంక్.. జగన్ సర్కారుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టి ఇతర మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులపై ఇదే మొత్తాన్ని, ఇంకా అవసరమైతే ఎక్కువ రుణాన్ని అయినా ఇచ్చేందుకు సిద్ధమని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఇకపోతే ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థిక సాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వరల్డ్‌ బ్యాంక్‌ తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.

ఏపీ రాజధాని అమరావతికి నిర్మాణం, అభివృద్ధికి అందించనున్న రుణ సహాయాన్ని తాము నిలిపివేస్తున్నట్టుగా వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వరల్డ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది. అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవడంతో తాము విషయంలో వెనక్కితగ్గినట్టుగా ప్రపంచబ్యాంక్ తెలిపింది.

మరోవైపు ఏపీకి ప్రపంచబ్యాంక్ రుణా సాయాన్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించినప్పటికి .. మరో తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని తెలిపింది. అదేవిధంగా భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది.

ప్రపంచబ్యాంకు రుణ సాయం విషయంలో వెనక్కితగ్గడంతో ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్ధాయిలో అధికార పార్టీపై నిప్పులు చెరిగింది. అర్థంపర్ధంలేని విధంగా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలతోనే ఈ విధంగా వరల్డ్ బ్యాంక్ వెనక్కివెళ్లిపోయిందని ఆరోపణలకు దిగారు టీడీపీ నేతలు. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఖరివల్లే ఇలా జరిగిందని అధికార వైసీపీ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపధ్యంలో విషయం సీరియస్ అయ్యే సరికి నేరుగా ప్రపంచబ్యాంకునే వివరణ కోరడంతో అసలు ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందో వెల్లడించారు వరల్డ్ బ్యాంక్ అధికారులు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..