అభయ్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

హైదరాబాద్:

ఒడిశా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అభయ్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

అభయ్ ఒడిశా కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

ఒడిశాలో నేర విభాగం, ప్రత్యేక విభాగంలో పనిచేశారు. అదేవిధంగా సీబీఐ, సీఆర్పీఎఫ్, ఎన్‌సీబీలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు.

ఇండియన్ పోలీస్ మెడల్, రాష్ట్రపతి మెడల్ పొందారు.

మయన్మార్, ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, రష్యా, ఇండోనేషియాతో జరిగిన చర్చల్లో భారత బృందంలో సభ్యుడిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అభయ్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్‌పీఏలో 350 మంది శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.

గత పదేళ్లలో అకాడమీలో ఎన్నో మార్పులు వచ్చాయన్న ఆయన.. ఉన్నత ప్రమాణాలతో ఐపీఎస్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

శిక్షణలో ఐపీఎస్‌లకు అకాడమీ శిక్షణతో పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

సైబర్, తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాల నిరోధంపై సైతం శిక్షణ అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..