కైరా అద్వానీ అడుగుజాడల్లో అదా శర్మ.. ఆ పాత్రకు సై అంటోన్న పూరీ భామ..

కైరా అద్వానీ అడుగు జాడల్లో ఇపుడు అదా శర్మ కూడా వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అదాశర్మ విషయానికొస్తే.. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆదా శర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఈమెకు అంతగా కలిసిరాలేదు. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత తెలుగులో ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’ లాంటి హిట్ సినిమాల్లో నటించినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు.దీంతో చేసేది లేక ఈ అమ్మడు సమయం వచ్చినపుడల్లా అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది. దాంతో పాటు కికి ఛాలెంజ్‌తో పాటు బెల్లీ డాన్స్‌లతో పాటు రకరకాల పోస్ట్‌లతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. రీసెంట్‌గా రాజశేఖర్ హీరోగా నటించిన ‘కల్కి’లో కథానాయికగా నటించినా అంతగా గుర్తింపు తెచ్చులేకపోయింది.

అందుకే ఈ మధ్య కాలంలో అందరు హీరోయిన్లు చేసినట్టుగా వెబ్ సిరీస్ చేస్తోంది. ‘ది హాలీడే’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో అదా..మెహెక్ అనే అమ్మాయి పాత్రలో నటించింది. తన పెళ్ళికి ముందురోజు ముగ్గురు చిన్నప్పటి బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుందట. అలాగే పగలు, రాత్రి రోజంతా హాలిడే ట్రిప్ బాగా ఎంజాయ్ వేస్తుందట.ఈ వెబ్ సిరీస్ గతంలో కైరా చేసిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ లా హైలెట్ అయింది.

ఈ సిరీస్ లో బ్యాచిలర్ పార్టీ సన్నివేశాలు యువతను ఆకట్టుకున్నాయని తెలిపింది ఆదా శర్మ. ఏదేమైనా బోల్డ్ బ్యూటీ కైరా అడుగుజాడల్లో నడుస్తోంది ఆదా శర్మ.ఇక కైరా.. కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి అవకాశాలు లేని టైమ్‌లో వెబ్ సిరీస్‌లో నటించింది. కానీ అదాశర్మ మాత్రం కెరీర్‌లో సరైన హిట్స్ లేని టైమ్‌లో మాత్రమే ఈ సిరీస్ చేయడం కొసమెరుపు.  మరి వెబ్ సిరీస్‌తో అదా శర్మ తను కోరుకున్న సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..