వలస కానిస్టేబుళ్లు
వలస బ్రతుకులుగా మారిన వైనం*
పోలీస్ శాఖలో ఎన్నడు లేని విదంగా ముఖ్యంగా 2008 నుంచి జరుగుచున్న పోలీస్ రిక్రూట్మెంట్లో జరిగిన మార్పులు కారణంగా 20% నాన్ లోకల్ కేటగిరి ఉద్యోగస్తుల నియామకం చేస్తున్నందున సొంత జిల్లాలను వదిలి, నియామక జిల్లాలలో పనిచేస్తున్న నాన్ లోకల్ పోలీస్ కానిస్టేబుళ్ళు అనేక కష్టాలకు గురు అవుతున్నారు.
ఎంతో కష్టబడి తెచ్చుకున్న ఉద్యోగం, అదికాస్తా సొంత జిల్లలో కాకుండా వేరేజిల్లలో అయితే ఆ బాధ వుద్యోగం వచ్చింది అనే సంతోషం కంటే నాన్లోకల్లో ఉద్యోగం చేస్తుండగా పడే కష్టాలు ఎక్కువ.
*సాధారణ సెలవు ఉపయోగం లేకపోయే*
పుట్టిపెరిగిన జిల్లాని వదిలి, తల్లి తండ్రిలను వదిలి, దూరంగా వేరే జిల్లలో ఉద్యోగం చేస్తూ ఎటు చూసినా కష్టాలే తోడుగా, కుటుంబాన్ని, సొంత జిల్లాలిని వదిలి పోలీస్ ఉద్యోగంలో వత్తిడి, క్షణం కుడా తీరిక లేకుండా ఉద్యోగం చేయడంతో, ఉద్యోగ బాద్యత లోనే సమయం అంతా సరిపోవడంతో, పనిచేసే జిల్లాలు సొంత జిల్లాలకు దూరంగా వుండటం వలన ఇంటిదగ్గర తల్లి తండ్రులకు, కుటుంబ సబ్యులకి ఎటువంటి తోడు లేక, వాళ్ళకి తోడుగా ఉండలేక, సెలవు పెట్టుకుని నియామక జిల్లాల నుంచి, సొంత జిల్లాలలోని స్వస్థలానికి వెళ్లేందుకు కానిస్టేబుల్ కి ఇచ్చే మూడు లేదా నాలుగు రోజుల సెలవులలో వెళ్ళడానికి ఒకరోజు, తిరిగి రావడానికి ఒకరోజు పట్టడం తో కుటుంబానికి గాని, తల్లి తండ్రులకు గాని సరైన సమయం వెచ్చించడంలో గాని, లేదా స్వస్థలంలోని సొంత పనులు, వివాహది శుభకర్యములకు గాని హాజరు కావడం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
*15 రోజుల సెలవులో 7రోజులు రైలులోనే గడపాలిసిన పరిస్థితి*
పోలీస్ శాఖలో కానిస్టేబుల్ స్థాయిలో సొంత జిల్లాలలోనే నియామకం వుంటుంది. కాని 20% నాన్ లోకల్లో సెలెక్ట్ కాబడిన ఇతర జిల్లాలకి నియామకం అయిన సొంత జిల్లాల నుండి నియామక జిల్లా సుమారు 400 KMs నుండి 900KMs వుండటం వలన ఇచ్చిన 3 లేదా 4 రోజుల సెలవులో సొంత పనులపై శెలవుపై వెళ్లి, వచ్చేందుకు రైలులోనే 2,3 రోజులు గడపాల్సి వస్తుంది.
*సామాజిక సంబంధాలకు దూరంగా*
స్వస్థలం లోని ఆస్తులకు, కుటుంబ సబ్యులకు, బందువులకు దూరమై సామజిక సంబందాలు కొనసాగించలేక జీవిస్తున్నారు. సొంత జిల్లాలలో ఉద్యోగం చేసే అవకాశo లేక అనుక్షణం మనోవేదనతో ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు.
*వీక్లీ హాఫ్ వలన ఉపయోగం లేని పరిస్థితి*
కుటుంబాలు దూరంగా ఉండటం వలన ఇటీవల వచ్చిన వీక్లీఆఫ్ ను వినియోగించుకొని కుటుంబ సబ్యులతో గడపలేని పరిస్థితి.
*వలస జిల్లాలనుండి కానిస్టేబుళ్ల వలస*
వలస జిల్లాలుగా పేరుగాంచిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వలస కూలీలు ప్రాముఖ్యం, ఇప్పటికీ వలస జిల్లాలగానే పేరు, అదే విధంగా పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులను మాత్రమే నాన్-లోకల్ 20% కోటాలో నియమించటం వలన కానిస్టేబుల్ స్థాయిలో నియామక జిల్లాకు వలస వెళ్లే పరిస్థితి.
*సీఎం గారి పైనే విశ్వాసం*
త్వరలో జిల్లాల వర్గీకరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందున జిల్లాల వర్గీకరణ చేసే సమయంలో నాన్ లోకల్ పోలీస్ ఉద్యోగులని వారి సొంత జిల్లాలలో ఉద్యోగం చేసే విదంగా నాన్ లోకల్ పోలీస్ కానిస్టేబుల్ యందు, వారి కుటుంబాలయందు కరుణజూపి శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటారని నాన్ లోకల్ కానిస్టేబుల్స్ విశ్వసిస్తున్నారు.
Comments
Post a Comment