రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది.. దాదాపు 12 సవరణ బిల్లులను సభ ముందుకు తేవాలని భావిస్తున్న ప్రభుత్వం
*అమరావతి*
*రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది.. దాదాపు 12 సవరణ బిల్లులను సభ ముందుకు తేవాలని భావిస్తున్న ప్రభుత్వం..*
ఈ సమావేశంలోనే వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది..
*ఇవే చట్ట సవరణల ప్రతిపాదనలు..!!*
రాష్ట్రంలో *లోకాయుక్త* నియామకానికి సంబంధించి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా తెలంగాణా తరహాలో చట్ట సవరణ చేపట్టనున్నారు.
*విద్యుత్ నియంత్రణ మండలి* సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
*జ్యుడీషియల్ కమిషన్* నియామకం కోసం ఏపీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఎనేబిలింగ్ చట్టం 2001 కీ సవరణ చేయనున్నారు.
*మౌలిక సదుపాయాల కల్పన*, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక పాఠశాలలు, కళాశాలల్లో *ఫీజు నియంత్రణకు* సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేసేందుకు నూతన బిల్లులను శాసనసభ ముందుంచనుంది.
రాష్ట్రంలో *వైద్యారోగ్యానికి సంబంధించిన* సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టు ల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవరణను తీసుకురానుంది.
*హిందూ ధార్మిక చట్టానికీ..*
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశాల పైనా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు..
*రెవన్యూతో పాటు కార్మిక శాఖకు* సంబంధించిన రెండు అంశాల్లోనూ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభ ముందుంచనుంది.
Comments
Post a Comment