ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తాం

అమ‌రావ‌తిః 

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తాజాగా ఈ విషయమై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
       
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సభ్యులు ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సభ్యులు స్పందిస్తూ.. జిల్లాల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఇందుకోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం ఉండేలా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది