సోపోర్‌ పట్టణంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

శ్రీనగర్‌ :

జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

సోపోర్‌కు సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు బలగాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు.

ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

అతని వద్ద ఉన్న ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ముందస్తు జాగ్రత్తగా సోపోర్‌ పట్టణంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?