‘ఇస్మార్ట్ శంక‌ర్’.. పూరీ జగన్నాథ్‌ డబుల్ దిమాక్ కహానీ..

న‌టీన‌టులు: రామ్, న‌భా న‌టేష్, నిధి అగ‌ర్వాల్, స‌త్య‌దేవ్
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి

కథ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పూరీ జ‌గ‌న్నాథ్

కొన్నేళ్లుగా పూరీ నుంచి వ‌స్తున్న సినిమాలేవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం లేదు. ఇప్పుడు కాస్త ఇస్మార్ట్ గా ఆలోచించి ఇస్మార్ట్ శంక‌ర్ అంటూ వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఇది ఎలా ఉంది.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా లేదా..?

క‌థ‌:

ఇస్మార్ట్ శంక‌ర్(రామ్) హైద‌రాబాదులో పేరు మోసిన రౌడీ. సుపారీలు తీసుకుని ప‌నులు చేస్తుంటాడు. హాయిగా త‌న ల‌వ‌ర్ చాందిని(న‌భా న‌టేష్)తో క‌లిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే ఓ సారి సుపారీ తీసుకుని మాజీ ముఖ్య‌మంత్రిని చంపేస్తాడు. ఆ కేసులో జైలుకు వెళ్తాడు. అదే స‌మ‌యంలో ఆ కేసును సిబిఐ ఆఫీస‌ర్ అరుణ్ (స‌త్య‌దేవ్) ఇన్వెస్టిగేట్ చేస్తూ షూటౌట్ లో చ‌నిపోతాడు. కానీ ఈ కేసుకు సంబంధించిన కీల‌క విష‌యాలు అరుణ్ ద‌గ్గ‌రే ఉంటాయి. అప్పుడు న్యూరో సైంటిస్ట్ శంక‌ర్ మైండుపై ఓ ప్ర‌యోగం చేస్తుంది. అదేంటి.. అస‌లు స‌క్సెస్ అయిందా లేదా.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది క‌థ‌..

క‌థ‌నం:

పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాల్లో కొన్ని రోజులుగా అస‌లు క‌థ‌లే ఉండ‌టం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న క‌నీసం ప‌ట్టించుకోకుండా చుట్టేస్తున్నాడ‌ని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. చివ‌రికి కొడుకుతో చేసిన సినిమా కూడా ఇలాగే ఉండ‌టంతో ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. దాంతో చాలా టైమ్ తీసుకుని ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ రాసుకున్నాడు ఈయ‌న‌. ఈ సారి కాస్త కొత్త క‌థను కూడా ప‌ట్టుకొచ్చాడు. బుర్ర మార్పిడి అనే క‌థ‌ను తీసుకుని దానికి త‌న స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే జోడించాడు పూరీ. ఇస్మార్ట్ క‌థ కాక‌పోయినా కూడా తీసిన విధానం మాత్రం ఇస్మార్ట్ గానే ఉంది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ అయితే ఎక్క‌డా ఆగ‌కుండా ప‌రుగులు పెట్టింది. చాలా రోజుల త‌ర్వాత పూరీ నుంచి త‌న మార్క్ సినిమా వ‌చ్చింది. డైలాగ్స్, డాన్సులు, యాక్ష‌న్ సీక్వెన్సులు అన్నింట్లో పూరీ మార్క్ క‌నిపించింది. క‌థ రొటీన్ గానే ఉన్నా కూడా క‌థ‌నం బాగుండ‌టంతో ఫ‌స్టాఫ్ కే పైసా వ‌సూల్ అయిపోయింది. కానీ ఆ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌లైంది. అక్క‌డ్నుంచి పూరీకి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అప్ప‌టి వ‌ర‌కు పూరీ మారిపోయాడేమో అనుకుంటే.. లేదు నేనింకా మార‌లేద‌ని మ‌రోసారి రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించాడు. ఒక‌రి మైండ్ తీసి మ‌రో వ్య‌క్తికి పెట్టిన త‌ర్వాత కూడా ఓసారి అలా.. మ‌రోసారి ఇలా అంటూ క‌న్ఫ్యూజ్ చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. అస‌లు ఇలా ఉంటారా అనే లాజిక్స్ అడ‌క్కూడ‌దు.. ఎందుకంటే అక్క‌డ లాజిక్ లేని స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. మాస్ అనే ముద్ర‌లో ఆయ‌న చేసిన మ్యాజిక్ మాత్ర‌మే చూడాలంతే. రొటీన్ క‌థ‌కే దిమాక్ చేంజ్ అనే లైన్ జోడించి కొత్త ట‌చ్ ఇచ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. దానికితోడు చాలా రోజుల త‌ర్వాత వ‌చ్చిన మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ ఇది.

న‌టీన‌టులు:

రామ్ అయితే ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌లో జీవించేసాడు. ఈ కారెక్ట‌ర్ ను న‌ర‌న‌రాల్లోకి ఎక్కించేసుకున్నాడు. తెలంగాణ యాస‌లో డైలాగులు అదిరిపోయాయి. న‌భా న‌టేష్ గ్లామ‌ర్ షో అదిరిపోయింది.. న‌ట‌న కూడా బాగుంది. నిధి కూడా గ్లామ‌ర్ షోతో చంపేసింది. స‌త్య‌దేవ్ ఉన్న‌ది కాసేపే అయినా కూడా అత‌డి మీదే క‌థ అంతా న‌డుస్తుంది. మిగిలిన వాళ్లంతా త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:

మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అదిరిపోయింది. చాలా రోజుల త‌ర్వాత ఈయ‌న నుంచి వ‌చ్చిన క్యాచీ ట్యూన్స్ ఇవే. ముఖ్యంగా ఇస్మార్ట్ శంక‌ర్ టైటిల్ సాంగ్ పిచ్చెక్కించింది. ఎడిటింగ్ ప‌ర్లేదు.. సెకండాఫ్ కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేదేమో..? సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు.. రాజ్ ప‌నిత‌నం బాగుంది. పూరీ క‌థ‌కుడిగా కంటే కూడా ఈ సారి డైలాగ్ రైట‌ర్ గా ఆక‌ట్టుకున్నాడు. తెలంగాణ యాస‌లో ఇంత బాగా ఆయ‌న డైలాగులు రాయ‌డం అద్భుత‌మే. రొటీన్ క‌థ‌కే త‌న మార్క్ స్క్రీన్ ప్లే జోడించి ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను మాస్ ఆడియ‌న్స్ కు చేరువ చేసాడు పూరీ.

రేటింగ్: 3/5

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..