రైతులకు తీపి కబురు..ఎకరా భీడు భూమిపై ఇప్పుడు ఏటా రూ.80,000 సంపాదించవచ్చు

రైతులకు తీపి కబురు.  భీడు భూమి లేదా తక్కువ దిగుబడినిచ్చే భూమిలో ఏడాదికి  రూ. 80, 000 సంపాధింవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో సోలర్ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. దీని పేరు సౌర వ్యవసాయం అని పెట్టబోతుంది.  సోలర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో రైతులు తమ భూమి ద్వారా ఎకరానికి రూ. 80,000  ఆదాయం పొందే అవకాశముంది.

గురువారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. రైతులు తమ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చుకోవచ్చన్నారు. అదే సోలార్ పవర్ ను కేంద్ర  ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు.

1 మెగావాట్  సోలార్ ప్లాంట్ నిర్మించడానికి 5 ఎకరాల భూమి అవసరమని ఇంధన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.ఒక సోలార్ ప్లాంట్ వార్షిక ప్రాతిపదికన సుమారు 11 లక్షల యూనిట్ల విద్యుత్తును పొందగలదు.

ఎకరా బంజరు భూమిని కలిగి ఉన్న రైతు 0.2 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సహాయపడగలడని అధికారి తెలిపారు. అలాంటి సోలర్ ప్లాంట్లు  ఏడాదికి 2.2 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లభిస్తుందని తెలిపారు.

కుసుము పథకం అనే పిలువబడే ఈస్కిమ్ ప్రకారం రైతుల భూమిలో సోలర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే డెవలపర్లు..రైతుకు కనీసం యూనిట్ కు 30 పైసలు చెల్లించాలి. ఇది నెలకు రూ. 6,600 కాగా ఏడాదికి  రూ. 80,000 అవుతుంది. అంతేకాదు భూమిపై యజమానికే హక్కులు కలిగి ఉంటాయి.ఈ పథకం ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును కొనుగోలు చేసే డిస్కామ్‌లు (పంపిణీ సంస్థలు) యూనిట్‌కు 50 పైసల సబ్సిడీ పొందుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకాన్ని త్వరలో కేబినెట్‌కు సమర్పించనున్నారు.

రైతులు ఒకే భూమిలో ఒక షెడ్‌ను నిర్మించవచ్చు. కూరగాయలు లేదా ఇతర చిన్న పంటలను షెడ్ కింద పండించవచ్చు, పైన సోలార్ ప్యానెల్ ఉంటుంది. నీటిపారుదల లేకపోవడం లేదా తక్కువ దిగుబడి కారణంగా వ్యవసాయాన్ని వదులుకునే అనేక మంది రైతులు ఇప్పుడు తమ భూములను ఈ సౌర వ్యవసాయ పథకం ద్వారా ఉపయోగించుకోవచ్చు

.15-20 రోజుల్లో పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం  సిద్దంగా ఉందన్నారు.  2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న  లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ ఈ పథకాన్ని  ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

Comments

  1. చాలా బాగుంది.
    మా దగ్గర దాదాపు గత పూర్వకాలం నుంచి వాడుకలో లేని భూమి(8-12 ఎకరాల) వరకు ఉంది.అంటే సుమారుగా ఏరియాలో నాకు తెలిసి 50 ఎకరాల వరకు ఉంది.మాకు ఎలాంటి అవకాశం వస్తే మా అందరికి సహాయం చేసినవాళ్లు అవుతారు.
    తాలూక :- జహీరాబాద్,
    మండలం:- న్యాల్కల్,
    ఊరు. :- మీర్జాపూర్(N)
    జిల్లా. :- సంగారెడ్డి
    రాష్ట్రం. :- తెలంగాణ.
    ఫోన్ నంబర్:- 9133559696

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..