అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...
గుంటూరు జిల్లా
మాచవరం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం లక్ష్మీనారాయణరెడ్డి.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో బెల్ట్ షాపులు, గుట్కా, ఖైని , నాటుసార వ్యాపారం, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమంగా ఇసుక తరలింపు, అక్రమ మైనింగ్ వంటి నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అక్రమాలకు పాల్పడితే తమదృష్టికి తీసుకురావాలి అని తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కృషి చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Post a Comment