కొండగట్టు ప్రమాదం ఎఫెక్ట్.. 125 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు సీజ్‌

   అది 2018 సెప్టెంబరు 11.. మంగళవారం రోజు.. దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద చోటుచేసుకుంది. కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామం నుంచి జగిత్యాలకు బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదం జరిగి 65 మంది మృత్యువాతపడ్డారు. దీనికంతటికీ కారణం.. పరిమితికి మించి బస్సులో ఎక్కడమే. అయితే, అంతటి ఘోర ప్రమాదం జరిగినా ఆర్టీసీ నిర్వాహకుల్లో చలనం రాలేదు. సరికదా.. మళ్లీ బస్సులో ప్రయాణికులను కుక్కేస్తున్నారు. తాజాగా, ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల రవాణా శాఖ అధికారి కిషన్ రావు కొరడా ఝులిపించారు. బుధవారం ఓ పల్లె వెలుగు బస్సులో పరిమితికి మించి ప్రయాణిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన బస్సును సీజ్ చేశారు.

వివరాల్లోకెళితే.. కోరుట్ల డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు పరిమితి 55 మాత్రమే. అయితే, ఆ బస్సులో ఏకంగా 125 మందిని కుక్కేశారు. ఈ విషయం తెలుసుకున్న కిషన్ రావు.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల వద్ద ఆ బస్సును ఆపేసి, ప్రయాణికులందర్నీ కిందకి దించేశారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించారన్న కారణంతో బస్సును సీజ్ చేశారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..