తెలుసుకోండి: పెట్రోల్ పంపుల్లో ఉచితంగా మీకు అందించాల్సిన సేవలివే.

భారత దేశంలో పెట్రోల్ పంపుల్లో ఉచిత టాయిలెట్, ఉచిత మంచినీరు, వాహనాలకు ఉచిత గాలి  సౌకర్యం కల్పించాలి.  అయితే వాహనాదారులు వాటిని  వినియోగించకుండా, కనీసం తెలుసుకోకుండా ఎన్నో సార్లు తిరస్కరించి ఉంటారు. అక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారో  ప్రతి వాహనాదారుడు  తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్ స్టేషన్లు అమలు చేసిన "మార్కెటింగ్ క్రమశిక్షణ మార్గదర్శకాల" పై సమగ్ర సమాచారాన్ని వెల్లడించాయి. చిల్లర వ్యాపారులు ఈ మార్గదర్శకాలను పాటించకపోతే, పెట్రోల్ పంప్ రిటైలర్లు జరిమానా చెల్లించాలి.

పెట్రోల్ పంప్ ద్వారా లభించే సేవలు:

వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తిని మరియు సరైన పరిమాణాన్ని సరైన ధర వద్ద అందించాలి.పెట్రోల్ పంపులు నడిచే వేళల్లో వాహనదారులకు ఉచిత గాలి సౌకర్యం కల్పించాలి.సలహా/ ఫిర్యాదు పుస్తకాన్ని ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీన్ని కస్టమర్లకు తెలియజేయాలి.పని వేళలు, సెలవుల పట్టికను వినియోగదారులకు  తెలియజేసేలా బోర్డు ఏర్పాటు చేయాలి.టాయిలెట్లు ఏర్పాటు చేసి ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించాలి.డీలర్,  చమురు కంపెనీ సిబ్బంది పేరు, ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి.ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్ ను కచ్చితంగా అందుబాటులో ఉంచాలి.శిక్షణ పొందిన సిబ్బందితో పాటు భద్రతా సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.పెట్రోల్ పంప్‌ను శుభ్రంగా  ఉంచాలి.24 గంటలు నీటి సౌకర్యం కలిగి ఉండాలి.తలుపులకు తప్పనిసరిగా గొళ్ళెం కలిగి ఉండాలి.

ఈ సేవలను పెట్రోల్ బంకులు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..