ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం.

అమరావతి: 

ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం.

3 లేదా 4రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరాల వరకు అమలు చేసిన ట్యూషన్‌ ఫీజులనే ప్రస్తుత (2019-20) విద్యా సంవత్సరంలోనూ కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో వెబ్‌ ఆప్షన్ల షెడ్యూల్‌పై దృష్టి సారించారు.

ఇప్పటికే ఎంసెట్‌ ర్యాంకర్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కావడంతో ఆప్షన్ల ప్రక్రియ చేపట్టి సీట్లు కేటాయించాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.

ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజులకు సంబంధించిన ఫైలుపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ బుధవారం సంతకం చేశారు.

అనంతరం సదరు ఫైలును సీఎం జగన్‌ ఆమోదానికి పంపారు.

సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే ఉన్నత విద్యాశాఖ ట్యూషన్‌ ఫీజులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనుంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..