Posts

చాక్లెట్ తింటే పడక గదిలో రెచ్చిపోతారు

 ప్రేమ కావ్యంలో చాక్లెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ బంధంతో ఒక్కటైన వారు తమ బంధం మరింత బలపడాలంటే డార్క్ చాక్లెట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్స్ తింటే పడకగదిలో రెచ్చిపోతారట..తర్వాత వారి మధ్య బంధం మరింత బలపడుతుందంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ప్రేమికుల రోజున గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని..తమ మధ్య బంధాన్ని మరింత ఇనుమడింపజేసుకుంటున్నారు. ప్రేమికుల వారోత్సవాల్లో మూడో రోజైన నేడు(ఫిబ్రవరి 9) చాక్లెడ్ డేగా జరుపుకుంటున్నారు. ప్రేమ కావ్యంతో శృంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా  సెక్స్ కోరికలుపెరుతాయని పరిశోధనల్లో తేలాయి. చాక్లెట్స్ తిని తమ సంసార జీవితాన్ని మరింత సుఖమం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  పడక గదిలో రెచ్చిపోవాలంటే చాక్లెట్స్‌తో పాటు వీటిని కూడా ట్రై చేయాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.  పాలకూర తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.. దీంతో పాటు కోరికలు పెరుగుతాయి. వెల్లుల్లి తినడం వల్ల ఆడవారు, మగవారిలోనూ లైంగిక వాంఛ పెరుగుతుందని నిర్ధారణ అయింది. ధనియాల పొడిని నీటిలో కలిపి కాసింత పసుపు వేసి తాగడం వ...

నన్ను డైరెక్ట్ చేసేంత ఉందా నీకు .. ... బుర్ర తిరిగుండాలి హరీష్ కి !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' సినిమాని డైరెక్టర్ చేసే ఛాన్స్ అందుకొని ఊహించని షాకిచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వా డీజే - గద్దలకొండ గణేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినా పవన్ అవేవీ పట్టించుకోకుండా 'గబ్బర్ సింగ్' తీసిన నమ్మకంతో హరీష్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ నేపథ్యంలో హరీష్ తో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో హరీష్ బిజీగా ఉన్నాడు. క్రిష్ తో పవన్ 27 సినిమా పూర్తవ్వగానే.. హరీష్ శంకర్ తో పవన్ 28 ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తాడట. ఆ నేపథ్యంలో హరీష్ శంకర్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'గబ్బర్ సింగ్' అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పవన్ 28 ఉంటుందని హరీష్ గొప్పలు పోతున్నాడు. అంతేకాదు.. పవన్ సినిమా అవ్వగానే.. మెగాస్టార్ చిరంజీవితోను సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. చిరుతో సినిమానా ..! అంటే.. అది నిజమేనని హరీష్ కన్ఫామ్ చేసేసాడు కూడా. పవన్ కళ్యాణ్ 28 తర్వాత మెగాస్టార్ నే డైరెక్ట్ చేస్తాననని రీసె...

నిరుద్యోగులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించడమెలా?

Image
ఇప్పుడు యువత కష్టపడకుండానే డబ్బులను సంపాదించే మార్గాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వీటి వలన కొందరు సక్సెస్ అవుతుంటే.. కొందరు నష్టాల బారిన పడుతున్నారు. కానీ దేనినైనా తెలివిగా చేస్తే తప్పకుండా ఆదాయాన్ని సంపాదించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పరంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఏటీఎంలు వచ్చిన దగ్గరినుంచీ డబ్బుల లావాదేవీలు మరింత సులువయ్యాయి. ఏటీఎంలు దాదాపు 9 రకాల సేవలను అందిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఆర్బీఐ నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 'వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని' తెరపైకి తీసుకొచ్చింది ఆర్బీఐ.ఇప్పటికే వివిధ బ్యాంకింగ్ సంస్థలు ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇందులో 12 సంస్థలకు ఆర్బీఐ లైసెన్స్‌లు కూడా కేటాయించింది. అంతేకాకుండా ఈ కంపెనీలు ఏటీఎంలను ఏర్పాటు చేసే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ఏటీఎంను నెలకొల్పడం ఎలా? మీరు ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందు బిజీగా ఉన్న మార్కెట్‌లో 25 నుంచి 50 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మీరు టై అప్ అయిన బ్యాంక్ లేదా కంపెనీ.. మీకు 'వైట్ లేబుల్ ఏటీఎం'లను అందిస...

కనువిందు చేస్తున్న తొలకరి మంచు ...

సిమ్లా: హిల్‌స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలను నిన్న తొలకరి మంచు పలకరించింది.  మండి జిల్లాలోని జంజేహ్లి ప్రాంతంలో హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది.  హిమాచల్‌ క్యాపిటల్‌ సిటీ సిమ్లాతోపాటు ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కుఫ్రిలో హిమపాతం కురుస్తూనే ఉంది.  ఇప్పటికే కాంగ్రాలో అత్యధికంగా 18.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా..చంబా, డల్హౌసీలో 7 మి.మీల వర్షపాతం (మంచువర్షం), జుంగీలో 2మి.మీ, జ్వాలి 1 మి.మీ, సిమ్లాలో 0.8 మిమీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  మరోవైపు మండి జిల్లాలోని సీరజ్‌ వ్యాలీలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ రెండు ఇగ్లూ (మంచు ఇల్లు)లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం ...

అహ్మదాబాద్‌: తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌ రైలును అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పీయుష్‌గోయల్‌ మాట్లాడుతూ... రైలు నడిచే టైంటేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని తెలిపారు.  పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది.  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ ముబైల్‌ యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ తీసుకోవచ్చు.  తత్కాల్‌ కోటా, ప్రీమియం తత్కాల్‌ కోటా ఇందులో లేవు. జనరల్‌ కోటా, విదేశీ టూరిస్ట్‌ కోటా మాత్రమే ఉన్నాయి.  ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత భీమా కల్పిస్తున్నాం. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ పరిహారంగా చెల్లిస్తుంది.  ప్రతీ ప్రయాణికుడికి ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్ కు అదనంగా ప్రతి కోచ్‌లో ఆర...

ముంబై వరుస పేలుళ్ల దోషి .. పెరోల్ పై మిస్సింగ్

ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడు.  68 ఏళ్ల జలీస్‌ అన్సారీ ముంబై వరుస పేలుళ్ల కేసులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రకారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.  ఇటీవలే అతడు 21 రోజుల పేరోల్‌పై బయటకు వచ్చాడు.  అయితే పెరోల్‌పై ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జలీస్‌ అన్సారీ అగ్రిపడా (ముంబై) పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది.  అయితే గురువారం రోజు జలీస్‌ అన్సారీ పీఎస్‌కు రాలేదు.  దీంతో అతడి కొడుకు జైద్‌ అన్సారీ తన తండ్రి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు జలీస్‌ అన్సారీ కోసం ఆపరేషన్‌ ప్రారంభించారు.

ముఖేష్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్‌ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు.  ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు.  హోంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. తాజాగా రాష్ట్రపతి ముఖేష్‌సింగ్‌ దరఖాస్తును తిరస్కరించారు.  ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.  దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ముఖేశ్‌ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి సిఫారసు చేశారు.