Posts

గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది

న్యూఢిల్లీ దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) అంటారు.  గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.  కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్‌ ప్లస్‌ క్యాటగిరి రక్షణను కల్పించారు.  ఇకపై వీరి రక్షణ బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 100 మంది భద్రతా సిబ్బంది చూడనున్నారు.  మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబానికి ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను కల్పిస్తూ వస్తుంది.  దేశంలోని వీఐపీలకు కల్పించే భద్రతపై సమీక్ష అనంతరం కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నిర్ణయం వెలువరించింది.

అయోధ్య తీర్పు నేడే.అంతటా అప్రమత్తత.

డిల్లీ:-  దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది! అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం ఉదయం 10:30 గంటలకు తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆలోగా తుది తీర్పు వెలువడుతుందనే అంచనా ఉందిగానీ.. ఏ రోజు అనే విషయమై ఇన్నాళ్లూ స్పష్టత లేదు. కానీ అనూహ్యంగా.. శనివారం ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌. ఉత్తరప్రదేశ్‌ సీఎస్‌ రాజేంద్రకుమార్‌ తివారీ, డీజీపీ ఓంప్రకాశ్‌తో శుక్రవారం తన చాంబర్‌లో మాట్లాడారు. భద్రతా ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీర్పు వచ్చాక అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌కు కేంద్ర హోంశాఖ గురువారమే 40 కంపెనీల పారామిలటరీ బలగాలను తరలించింది. అయోధ్య తీర్పు నేపథ్య...

అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు

అమరావతి అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు.  రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని.. ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు  అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడానికి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జీడీపీ తెలిపారు  పౌరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు  సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టామని వెల్లడించారు.  రాష్ట్రంలోని పరిస్థితులపై అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

భారీగా తగ్గిన పసిడి ధర..

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెల చివరిలో రూ. 40 వేలను తాకిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, ఇప్పుడు భారీగా దిగివచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో పాటు స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నారని విశ్లేషకులు తెలుపుతున్నారు. బుధవారం ఒక్కరోజులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు రూ. 672 తగ్గి, రూ. 37,575కు చేరింది. నిన్నటితో పోలిస్తే, ఇది 1.75 శాతం తక్కువ. ఇదే సమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1,490 పడిపోయి, రూ. 44,168కి చేరుకుంది. వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర: హైదరాబాదులో రూ.38,470 విజయవాడలో రూ.39,100 విశాఖపట్నంలో రూ.39,520 ప్రొద్దుటూరులో రూ.39,150 చెన్నైలో రూ.38,210గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర: హైదరాబాదులో రూ.36,650 విజయవాడలో రూ.36,250, విశాఖపట్నంలో రూ.36,350 ప్రొద్దుటూరులో రూ.36,270 చెన్నైలో రూ.36,580గా ఉంది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుఫాన్‌ శుక్రవారం అతి తీవ్ర తుఫాన్‌గా మారింది

విశాఖపట్నం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుఫాన్‌ శుక్రవారం అతి తీవ్ర తుఫాన్‌గా మారింది.  పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌ కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  శనివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌ సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌ ఇది మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఈ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.  ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీపై ప్రభావం ఉండదని తెలిపింది.

అయోధ్య తీర్పు ఈరోజు వెలువడనున్న నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది

న్యూఢిల్లీ:  అయోధ్య తీర్పు ఈరోజు వెలువడనున్న నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది.  రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు.  ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు.  ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది.  అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు.  అత్యంత సున్నిత ప్రాంతాలుగా పరిగణించే గజియాబాద్, సహరన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో వదంతులు సృష్టించేవారిపై నిఘాపెట్టారు.  ప్రయాణికులు ఇటువంటి వదంతులు విన్నవెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

ఇరు పక్షాలా వాదనలు

హిందూ పక్షాల వాదనలు మొఘల్‌ చక్రవర్తులు రచించిన 'ఐనీ అక్బరీ', 'తుజుక్‌ ఎ జహంగిరీ'లోనూ అయోధ్య నగర ప్రస్తావన ఉంది. ఈస్టిండియా కంపెనీ సహా అనేక మంది పాశ్చాత్య అధికారులు వేర్వేరు రికార్డుల్లో దీన్ని నమోదు చేశారు. బాబ్రీ మసీదుపై ఇస్లామిక్‌ రచనలు కొన్ని... పవిత్ర ఖురాన్‌, హదిత్‌కు విరుద్ధంగా ఉన్నాయి. రాముడి జన్మస్థానం అయోధ్యేనన్న విశ్వాసం శతాబ్దాలుగా ఉన్నట్లు అనేక ఆధారాలు చెబుతున్నాయి. జన్మస్థానంలో పూజలు చేసే హిందువుల ఆచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వివాద ప్రాంతంలో ఒక ఆలయం ఉండేదని, అది ధ్వంసమైందని పురావస్తు శాఖ నివేదిక కూడా చెబుతోంది. మసీదును ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. అయితే రామజన్మ భూమి ఒక్కటే ఉంది. ముస్లిం పక్షాల వాదనలు మసీదుకు బాబర్‌ నిధులు ఇచ్చినట్లు, దాన్ని ఆ తర్వాత నవాబులూ కొనసాగించినట్లు బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా గుర్తించింది. 1885లో దాఖలైన దావాలో సమర్పించిన అనేక పత్రాలు ఈ మసీదు ఉనికిని ధ్రువపరుస్తున్నాయి. ఆ స్థలం ముస్లింల అధీనంలోనే ఉండేది. 1949 డిసెంబరు 22, 23 తేదీల వరకూ అక్కడ ఈద్‌ ప్రార్థనలు జరిగాయి. రామ జన్మభూమిలో దేవుడి ప్రతిమ ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాలు లేవు. ...