Posts

తెలంగాణ ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్‌..!

తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందా..? అన్న ప్రశ్నపై విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. స్టాఫ్‌ను తగ్గించడం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇప్పటి వరకు ఆర్టీసీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 50 శాతం ప్రయివేట్ రూట్‌లు, ప్రయివేటు బస్సులను తీసుకొస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది ఐదువేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకు 10,400 బస్సులకు ఈ 50 వేల మంది కార్మికులు పనిచేసేవారు.బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో 20 నుంచి 25 వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. దీనిపై కొంత కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.అయితే, ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చన్నది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత 50 వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్‌ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్స...

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి. 48 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని జేఏసీ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జేఏసీ కోరింది. ఎలాంటి షరతులపై కార్మికులు సంతకాలు చేయరని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. అలాంటి వాతావరణం కల్పించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయి. సమ్మెకు సంబంధించి లేబర్‌ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బుధవారం జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్నాకే సమ్మె విరమించాలని, అర్ధంతరంగా సమ్మె విరమిస్తే.. ఇన్నాళ్లు చేసిన పోరాటానికి ఫలితమూ, ప్రయోజనమూ ఉండదని మరికొందరు...

డ్యూటీ ఎక్కుతాం.. తీసుకోండి!

ఆర్టీసీ కార్మికుల నుంచి వస్తున్న అభ్యర్థనలు -వచ్చినా విధుల్లోకి తీసుకునే వీలు లేకపోవడంతో వెనుదిరుగుతున్న వైనం -400 మంది కార్మికులు చేరేందుకు నిర్ణయం -అధికారుల నుంచి స్పందన కరువవ్వడంతో వెనక్కి -మళ్లీ ఆందోళనలకు జేఏసీ పిలుపు..స్పందన అంతంత మాత్రమే నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నా రు. షరతుల్లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని, వెం టనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విష యం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆత్రుతగా ఎదురుచూశారు. శుక్రవారం ఏకంగా చాలామంది కార్మికులు డిపోల వద్దకు వెళ్లి డ్యూటీ లో చేరాలని నిర్ణయించారు. దాదాపు 400 మంది వరకు ఆర్టీసీ డ్రైవర్లు, కండకర్లు విధుల్లో చేరాలని బయలుదేరేందుకు సిద్ధ్దపడగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వెనుదిరిగారు. కామారెడ్డి డిపో వద్దకు ఇద్దరు డ్రైవర్లు వచ్చారు. తమను డ్యూటీలో చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదని, తమకు ఎలాంటి ఆదేశాలు లే...

ఆర్టీసీ కార్మికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్

సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోడవంతో దాదాపుగా 5100 బస్సులను రోడ్లపైకి తీసుకొని వచ్చి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆర్టీసీ జేఏసీ వ్యతిరేకించి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున వధించిన అడిషినల్ జనరల్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయలేమని సుప్రీం కోయిర్ట్ ఇచ్చిన తీర్పుకి అనుగుణంగానే ప్రవేటీకరణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. సెక్షన్ 67 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీపై పూర్తి హక్కులు ఉంటాయని వాదించడం జరిగింది. అడిషినల్ జనరల్ వినిపించిన వాదనకు హైకోర్ట్ ఏకీభవించి ఆర్టీసీ జేఏసీ వేసిన కేసుని కొట్టివేసింది.దీనితో కేసీఆర్ సర్కార్ అనుకున్నట్లు రేపటి నుంచి 5100 ప్రైవేట్ బస్సులు రోడ్లెక్కనున్నాయి. రెండు రోజుల క్రితం తాము ఆర్టీసీ సమ్మెను ప్రస్తుతానికి పక్కన పెట్టి తమ విధులలో చేరుతామని ఆర్టీసీ జేఏసీ తెలియచేసినా కేసీఆర్ సర్కార్ ఎలాంటి స్పందన తెలియచేయలేదు. నిన్నటి నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద విధులలోకి చేరడానికి రాగా, ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ డిపో మేనేజర్ కు ప్రభు...

ఆర్టీసీ జాక్ లో ముసలం - రాష్ట్ర కార్యదర్శి పదవికి నగేష్ రాజీనామా..

హైదరాబాద్ - ఆర్టీసీ కార్మిక సంఘాల జాక్ లో ముసలం ప్రారంభమైంది. ఆర్టీసీ జేఏసీ గందరగోళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. జేఏసీ పెద్దలు స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండా సమ్మెపై విరమణ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. కార్మికులు విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చినప్పుడే భేషరతుగా చేరివుంటే భాగుండేదని నగేష్ మీడియాతో అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో మరోవైపు కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులనుంచి ఎలాంటి ఆదేశాలు లేకుంటే వారిని వెనక్కి పంపిస్తామమని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

అయ్యా.. మేము విధుల్లో చేరుతాం

కొంతమంది ఆర్టీసీ కార్మికుల వేడుకోలు అనుమతి లేదంటున్న అధికారులు హైదరాబాద్‌, 'అయ్యా మేము విధుల్లో చేరుతాం. మమ్మల్ని తీసుకోండి' అంటూ వివిధ ప్రాంతా ల్లో ఆర్టీసీ కార్మికులు అధికారులను వేడుకుంటున్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్‌-2 డిపోకు శుక్రవారం దాదాపు 30 మంది కార్మికులు డిపో మేనేజర్‌ రాజేందర్‌రెడ్డిని కలిశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విన్నవించుకున్నారు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి అనుమతి రాన్నందున విధుల్లోకి తీసుకోలేకపోతున్నానని చెప్పి ఆయన కార్మికులను తిప్పి పంపారు. జగిత్యాలలోనూ విధుల్లో చేరుతామని కొంతమంది కార్మికులు డిపో మేనేజర్‌ను కలవగా.. ఈ విషయమై తనకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆయన చెప్పారు.

ఆర్టీసీ రేట్లకే ప్రైవేట్ బస్సులు... 5100 బస్సులకు గ్రీన్ సిగ్నల్

మొత్తం 5,100 ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా తెలంగాణ సర్కార్ రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఇవాళే ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతుంది. అయితే ప్రైవేటు బస్సులను ఆర్టీసీ చార్జీలతోనే నడపాలని తెలిపింది. హైదరాబాద్ లో తిరిగే బస్సులకు కనీస చార్జీ 5 రూపాయలుగా ఉంది. సెట్విన్ బస్సుల్లో పదిరూపాలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల చార్జీలు రెట్టింపు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ లకు ఆర్టీసీ చార్జీలు నచ్చుతాయా..? వారికి గిట్టుబాటు అవుతుందా..? స్టేజి క్యారేజి పర్మిట్ లు తీసుకోవటానికి వారు ముందుకొస్తారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో 10,460 బస్సులున్నాయి. వీటిలో 2,103 అద్దె బస్సులు, 2,609 ఆర్టీసి సొంత బస్సులకు కాలం చెల్లింది. మరో 400-500 ల బస్సులకు మూడు నాలుగు నెలల్లో కాలం చెల్లనుంది. ఇవన్నీ కలిపి 5,100 వరకూ అవుతాయి. కొత్త బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దాంతో ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. ఆర్టీసీ ఆధీనంలో ఉన్న రూట్లలో ఇవి స్టేజీ క్యారేజీలుగా నడుస్తాయి. ఒక రూట్ లో ఉన్...