Posts

కనువిందు చేస్తున్న తొలకరి మంచు ...

సిమ్లా: హిల్‌స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలను నిన్న తొలకరి మంచు పలకరించింది.  మండి జిల్లాలోని జంజేహ్లి ప్రాంతంలో హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది.  హిమాచల్‌ క్యాపిటల్‌ సిటీ సిమ్లాతోపాటు ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కుఫ్రిలో హిమపాతం కురుస్తూనే ఉంది.  ఇప్పటికే కాంగ్రాలో అత్యధికంగా 18.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా..చంబా, డల్హౌసీలో 7 మి.మీల వర్షపాతం (మంచువర్షం), జుంగీలో 2మి.మీ, జ్వాలి 1 మి.మీ, సిమ్లాలో 0.8 మిమీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.  మరోవైపు మండి జిల్లాలోని సీరజ్‌ వ్యాలీలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ రెండు ఇగ్లూ (మంచు ఇల్లు)లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం ...

అహ్మదాబాద్‌: తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్‌గోయల్‌ రైలును అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.  కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పీయుష్‌గోయల్‌ మాట్లాడుతూ... రైలు నడిచే టైంటేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని తెలిపారు.  పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది.  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ ముబైల్‌ యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ తీసుకోవచ్చు.  తత్కాల్‌ కోటా, ప్రీమియం తత్కాల్‌ కోటా ఇందులో లేవు. జనరల్‌ కోటా, విదేశీ టూరిస్ట్‌ కోటా మాత్రమే ఉన్నాయి.  ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత భీమా కల్పిస్తున్నాం. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ పరిహారంగా చెల్లిస్తుంది.  ప్రతీ ప్రయాణికుడికి ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిల్ కు అదనంగా ప్రతి కోచ్‌లో ఆర...

ముంబై వరుస పేలుళ్ల దోషి .. పెరోల్ పై మిస్సింగ్

ముంబై: 1993 ముంబై వరుస పేలుళ్ల దోషి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడు.  68 ఏళ్ల జలీస్‌ అన్సారీ ముంబై వరుస పేలుళ్ల కేసులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కేంద్రకారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.  ఇటీవలే అతడు 21 రోజుల పేరోల్‌పై బయటకు వచ్చాడు.  అయితే పెరోల్‌పై ఉన్న సమయంలో ప్రతీ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జలీస్‌ అన్సారీ అగ్రిపడా (ముంబై) పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది.  అయితే గురువారం రోజు జలీస్‌ అన్సారీ పీఎస్‌కు రాలేదు.  దీంతో అతడి కొడుకు జైద్‌ అన్సారీ తన తండ్రి జలీస్‌ అన్సారీ కనిపించకుండా పోయాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు జలీస్‌ అన్సారీ కోసం ఆపరేషన్‌ ప్రారంభించారు.

ముఖేష్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి ముఖేష్‌సింగ్‌ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు.  ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హోంశాఖకు పంపిచారు.  హోంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపింది. తాజాగా రాష్ట్రపతి ముఖేష్‌సింగ్‌ దరఖాస్తును తిరస్కరించారు.  ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్‌ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.  దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు ముఖేశ్‌ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి సిఫారసు చేశారు.

భారత రత్న కన్నా మహోన్నతుడు మహాత్మా గాంధీ. :సుప్రీం కోర్టు

ఢిల్లీ మ‌హాత్మా గాంధీకి భార‌తర‌త్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తేవాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  అలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేని ఇవాళ‌ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టంచేసింది.  మ‌హాత్మా గాంధీ మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తి అని, ఆయ‌నకు ఉన్న గుర్తింపు చాలా విశాల‌మైన‌ద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.  భార‌త ర‌త్న బిరుదు క‌న్నా.. మ‌హాత్మాగాంధీ ఎంతో ఉన్న‌తుడ‌ని కోర్టు పేర్కొన్న‌ది.  మ‌హాత్మా గాంధీ.. జాతిపిత అని, ఆయ‌న్ను ప్ర‌జ‌లు ఎంతో ఉన్న‌తంగా చూస్తార‌ని, ఆయ‌న‌కు ఉన్న గుర్తింపు అన‌న్య‌మైంద‌ని కోర్టు తెలిపింది.  గ‌తంలోనూ ఇదే అంశంలో కోర్టులో ప‌లుమార్లు పిల్స్ వేశారు. కానీ కోర్టు తిర‌స్క‌రిస్తూనే వ‌చ్చింది.  మ‌హాత్మా గాంధీకి భార‌తర‌త్న ఇవ్వ‌డం అంటే ఆయ‌న్ను, ఆయ‌న చేసిన సేవ‌ల‌ను త‌క్కువ చేసి చూడ‌డం అవుతుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

2020 జనాభా లెక్కింపు

2020 జనాభా లెక్కింపు .. కేంద్రం కసరత్తు ఢిల్లీ: 2020 జనాభా లెక్కింపు, ఎన్‌పీఆర్‌ కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.  ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది.  సమావేశంలో కేంద్ర హోశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, జనాభా లెక్కింపు అధికారులు పాల్గొననున్నారు.  2020 జనాభా లెక్కింపు, జాతీయ జనాభా రిజిస్టర్‌ మార్గదర్శకాలపై చర్చించనున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.  శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.  స్వామివారి సర్వదర్శనానికి 10గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.  శ్రీవారిని నిన్న 83,077 మంది భక్తులు దర్శించుకున్నారు.  29,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.