ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ చార్జీ రూ, 1-50 చేయడం పై వైకాపా నేతలు హర్షం.

నెల్లూరు జిల్లా : 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ చార్జీ ని 1-50 రూపాయలు చేయడం పై ముత్తుకూరు మండలం వైకాపా నేతలు,కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, నడవడి ముత్యం గౌడ్ , రైతులు హర్షం వ్యక్తం చేశారు.

గురువారం ఉదయం వైకాపా కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వ్యవసాయ రంగానికి పగటిపూట 9గంటలు విద్యుత్ సరఫరా యివ్వడం పై కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజారంజకంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను రైతులు, వృద్దులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు.

తొలుత ఆక్వా రైతుల కోసం విద్యుత్ చార్జీలు తగ్గింపు కోసం ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి పోరాటం చేయడం జరిగింది.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ముఖ్యమంత్రి కాగానే రైతులకు న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.

రైతుల పక్షాన ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు.

ఈ సమావేశంలో రాజా, దయాకర్, కర్లపూడి సుబ్రహ్మణ్యం, బాలస్వామి,రవి,తంబి శ్రీనివాసులు,గుడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?