డయల్ - 100, వాట్సాప్ నంబర్ 9989819191 లకు సమాచారం అందించండి...
డయల్ - 100, వాట్సాప్ నంబర్ 9989819191 లకు సమాచారం అందించండి...
తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటాం
----జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విజ్ఞప్తి
- డయల్ - 100 , వాట్సాప్ నంబర్ 9989819191 లకు జూన్ నెలలో వచ్చిన కాల్స్ పై ఎస్పీ సమీక్ష
కర్నాటక నుండీ కడప జిల్లాలోని దేవాలయం వెళ్తూ ఓ కుటుంబం తాడిపత్రిలో దిగింది.
ఆసందర్భంగా నాలుగేళ్ల చిన్నారి ఆకుటుంబం నుండీ తప్పిపోయాడు.
వెంటనే డయల్ - 100 కు ఫోన్ చేశారు. ఇది జరిగిన గంటలోపే ఆ చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.
జిల్లా కేంద్రంలో రెండ్రోజుల కిందట ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఘటనలో కూడా స్థానికులు స్పందించి డయల్ - 100 కు సమాచారమివ్వడం...
ఆతర్వాత పోలీసులు వెంటబడి కిడ్నాపర్ల నుండీ ఆ విద్యార్థినిని సురక్షితం చేశారు.
ఈ రెండు ఘటనలు మచ్చుకు మాత్రమే. ఆత్మహత్యాయత్నం చేసిన వారిని... ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోడ్డు ప్రమాద క్షతగాత్రులను... వివిధ రకాల బాడిలీ అఫెన్సెస్ ను...
పేకాట, మట్కా, ఈవ్ టీజింగ్ , ఇసుక అక్రమ రవాణాలకు అడ్డుకట్ట... అగ్ని ప్రమాదాల ఆర్పివేత...
ఇలా ఎన్నో ప్రజోపయోగ సేవలను డయల్ - 100 ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు అందించారు.
ప్రజల నుండీ వచ్చిన కాల్స్ కు పట్టణ ప్రాంతాల్లో 5.88 నిముషాలు, రూరల్ ప్రాంతాల్లో 12.09 నిముషాలు, సరాసరి 6.81 నిముషాలుగా రెస్పాన్స్ టైం ను నిర్ధేశంగా పెట్టుకుని పోలీసులు సేవలందిస్తున్నారు.
గత నెలలో డయల్ - 100, జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9989819191లకు వచ్చిన కాల్స్ ... పోలీసుల స్పందన తీరును ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు సమీక్షించారు.
జిల్లా నుండీ గత నెలలో మొత్తం 1,362 కాల్స్ వెళ్లాయి. ఇందులో కుటుంబ కలహాలు, బాడిలీ అఫెన్సెస్ , రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అధికంగా వెళ్లాయి.
డయల్ - 100 కు వచ్చిన ప్రతీ కాల్ కు జిల్లాలోని ఆయా పోలీసులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపారు. 78 కేసులు కూడా నమోదు చేశారు.
జిల్లాలో గత నెల జరిగిన రోడ్డు ప్రమాదాలు సందర్భంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న 56 మంది క్షతగాత్రులను పోలీసు రోడ్డు సేఫ్టీ బృందాలు మరియు సంబంధిత పోలీసులు ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడారు.
కళ్యాణదుర్గం, అనంతపురం, ఉరవకొండలలో వేర్వేరు కారణాలుతో ఆత్మహత్యాయత్నం చేసిన ముగ్గురి ప్రాణాలు సంబంధిత పోలీసులు, బ్లూకోల్ట్స్ విభాగపు సిబ్బంది స్పందించి తక్షణ చర్యలు చేపట్టి నిలువరించారు.
ధర్మవరం పట్టణంలో తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు, తాడిపత్రి, కనేకల్లులో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు... మొత్తం నలుగుర్ని ఆ తల్లిదండ్రులకు అప్పగించారు.
జిల్లాలోని పది ప్రాంతాలలో చోటు చేసుకున్న బాడిలీ అఫెన్సెస్ ఘటనలను డయల్ - 100, వాట్సాప్ నంబర్ 9989819191 ల సమాచారంతో సద్దుమణిచారు.
అనంతపురం నాల్గవ పట్టణ, చిలమత్తూరు, హిందూపురం ఒకటవ పట్టణ, రామగిరి, ధర్మవరం పోలీసులు వేర్వేరుగా మట్కా, పేకాటలపై దాడులు చేసి ముగ్గురు మట్కా బీటర్లను అరెస్టు చేసి రూ. 14000/ మరియు 17 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని రూ. 21,323 లు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా గుమ్మఘట్ట, ఓ.డి.సి, బొమ్మనహాళ్ పోలీసులు అక్రమంగా మద్యం విక్రయించే ముగ్గుర్ని అరెస్టు చేసి వేర్వేరుగా 41 మద్యం సీసాలు సీజ్ చేశారు.
పామిడి మండలం కోనేపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఆర్డీఒ కు అప్పగించారు.
జిల్లా కేంద్రంలో బంగారు గొలుసు, రూ. 23 వేలు దొంగలించిన ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
జిల్లాలో వేర్వేరుగా జరుగుతున్న రెండు బాల్య వివాహాలుపై వచ్చిన సమాచారంతో సంబంధిత పోలీసు సిబ్బంది మరియు ఐ.సి.డి.ఎస్ , తదితర విభాగాలుతో కలసి నిలువరించారు.
అనంతపురం టూటౌన్ పోలీసులు ఈవ్ టీజింగ్ పై తక్షణమే స్పందించి ఒకర్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా గుత్తి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ దాబా సమీపంలో వ్యభిచారానికి పాల్పడుతున్న ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
కనగానపల్లి మండలం ముక్తాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన అగ్ని ప్రమాదాన్ని సంబంధిత అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలసి ఆయా పోలీసులు, బ్లూకోల్ట్ సిబ్బంది ఆర్పివేశారు.
పేకాటపై చర్యలు... అనంతపురం ఒన్ టౌన్ , కనేకల్లు, మడకశిర, విడపనకల్లు పోలీసు స్టేషన్ల పరిధిల్లో పేకాట ఆడుతున్న 23 మందిని అరెస్టు చేసి సుమారు రూ. 25 వేలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Post a Comment