జర్నలిస్టుల పిల్లలకు 100% పూర్తి రాయితి

*విద్యాశాఖాధికారిని ఆదేశించిన కలెక్టర్‌*

- కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీజేఎఫ్‌

గుంటూరు : ఏపీజేఎఫ్‌ గుంటూరు జిల్లా కమిటీ అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ జర్నలిస్టుల పిల్లల చదువులకు కార్పొరేట్‌ స్కూల్స్‌లో 100% పూర్తి స్థాయి ఫీజు రాయితీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా విద్యాశాఖాధికారిని ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

ఇప్పటి వరకు కార్పొరేట్‌ స్కూల్స్‌లో 50% రాయితీ మాత్రమే అమలులో ఉంది.

అనంతపురం, కడప జిల్లాల్లో ఆయా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జర్నలిస్టుల పిల్లలకు 100% పూర్తిస్థాయి రాయితీ ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఈ విషయాన్ని ఏపీజేఎఫ్‌ కమిటీ కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, గుంటూరు జిల్లాలో కూడా అమలు చేయాలని కోరారు.

వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.

అంతేకాకుండా ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిఇఓకు సూచించారు.

కలెక్టర్‌ చర్యలకు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?