ఉదయం 10 గంటల నుంచి
అమరావతి : గ్రామ వలంటీర్ల పోస్టులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గురువారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఏదైనా మండలంలో *700కు పైగా దరఖాస్తులు వస్తే* అక్కడ *అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు* చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఇప్పటికే సూచించారు.
*తొలిరోజు ఒక్కో మండలంలో ఇంటర్వ్యూ బోర్డు 30 మందినే పిలవాలని,*
*రెండో రోజు నుంచి రోజూ 60 మందికి,* ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యనే ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు.
*మహిళా అభ్యర్థులు, దివ్యాంగులను మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30 గంటల మధ్య మాత్రమే* పిలవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఫొటో ఐడీ, జెరాక్స్ కాఫీలు, సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు 30 నిమిషాల ముందుగా హాజరు కావాల్సి ఉంటుందని మండల స్థాయి అధికారులకు కమిషనర్ గిరిజాశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.
గ్రామ వలంటీర్ల ఎంపికలో భాగంగా 50 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని ఎంపిక చేస్తారు.
రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు.
ఒక గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వలంటీర్లందరికీ ఒకే రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఇంటర్వ్యూల్లో ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, జనరల్ అవేర్‌నెస్, యాటిట్యూడ్, సామాజిక బాధ్యత, సాంఘిక సమస్యలపై అవగాహన, స్థానిక సమస్యలపై అవగాహన, నాయకత్వ లక్షణాలు, వాగ్దాటిని పరిశీలిస్తారు.
Comments
Post a Comment