ఇవాళ 14 శాఖలపై మంత్రి బుగ్గన విడివిడిగా చర్చలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేడు 14 శాఖలపై విడివిడిగా చర్చలు జరపనున్నారు.
వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఇండస్ట్రీస్, హోమ్, పంచాయితీరాజ్, ఎక్సైజ్, మైనార్టీ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, సరేష్, సుచరిత, పిల్లి సుభాష్, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి, అంజాద్ బాషా హాజరుకానున్నారు.
కాగా.. ఈ సమావేశంలో సుమారు మూడు గంటలకు పైగా జరగనున్నట్లు తెలుస్తోంది.
త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఆర్థిక మంత్రి బుగ్గన కసరత్తు చేస్తున్నారు.
కాగా.. సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో సోమవారం విడివిగా సమావేశమైన విషయం తెలిసిందే.
Comments
Post a Comment