15 రోజుల్లో యజమానులు పోలీసులను ఆశ్రయించవచ్చు

15 రోజుల్లో యజమానులు పోలీసులను ఆశ్రయించవచ్చు -నగర సీపీ అంజనీకుమార్ 

హైదరాబాద్ : వివిధ కేసులు, నిబంధనల ఉల్లంఘనల్లో హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న 2,981 వాహనాలను ఎవరు కూడా తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో.. వాటిని బహిరంగ వేలంలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరించారు.

ఎవరైనా అభ్యంతరం చెప్పాలనుకున్నా, ఇందులో ఉన్న వాహనాలకు సంబంధించిన యజమానులు సంబంధిత పత్రాలతో ప్రకటన వెలువడిన రోజు నుంచి 15 రోజుల్లో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

15 రోజుల్లో ఎవరూ స్పందించకుంటే ఆ వాహనాలను వేలం వేస్తామన్నారు.

వాహనాలకు సంబంధించిన వివరాలకు గోషామహాల్ లో రిజర్వు ఎస్సై నర్సింహామూర్తి(9490616637)ని సంప్రదించాలని, www.hyderabadpolice.gov.in సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లోను వాహనాల నంబర్లను పరిశీలించుకోవచ్చని సీపీ సూచించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?