బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ), యూకో బ్యాంక్, అలహాబాద్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది. కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణమంటూ జరిమానా విధించింది. పీఎన్‌బీ, అలహాబాద్ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్ బ్యాంకుపై రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Post a Comment