2019-20 బడ్జెట్ హైలెట్స్..

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. రైల్వే శాఖలో ఏటా  కోట్ల పెట్టుబడుల అవసరం ఉందని తెలిపారు. దేశమంతటా మెరుగైన విద్యుత్ సేవల కోసం ‘ఒకే దేశం-ఒకే గ్రిడ్’ విధానం తీసుకొచ్చామని వెల్లడించారు. దీంతో విద్యుత్ ధరలు తగ్గాయని చెప్పారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని సీతారామన్ అన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి  ఆదుకునేందుకు ‘ఉదయ్’ను తీసుకొచ్చామని చెప్పారు. విమానాల ఫైనాన్సింగ్ విషయంలో దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

2019-20 బడ్జెట్ హైలెట్స్..

దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం

విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు

‘జల్ వికాస్ మార్గ్’ పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత

3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం ‘ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం’

ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులు

ఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు

లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం

ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన

సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు

సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?