2024 నాటికి ప్రతి ఇంటికి రక్షిత నీరు
న్యూఢిల్లీ :
దేశంలోని జలవనరుల విభాగాలన్నీ సమీకృతం చేస్తూ జల్‌శక్తి మంత్రాలయ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి రక్షిత నీరు సరఫరా చేస్తామన్నారు.
ఇప్పటికే ఉన్న రాష్ర్టాల పథకాలతో కలిసి లక్ష్యం దిశగా జలజీవన్ ఉంటుందన్నారు.
వాననీటి సంరక్షణ, గృహ నీటి శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
ఇక నుంచి వచ్చే నీటిని తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం తీసుకువస్తామన్నారు.
256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్ ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Comments
Post a Comment