21 ఏళ్ల అసోం యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టుచేశారు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖను మోసగించేందుకు యత్నించిన 21 ఏళ్ల అసోం యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. అప్పటికే వివిధ శాఖల అధికారులను బురిడీ కొట్టించి రూ.4 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. ఒకసారి ఇదే తరహా నేరానికి అరెస్టయి... బెయిల్‌పై వచ్చినా బుద్ధి మారలేదు. ఫలితంగా ఇప్పుడతడు మరోమారు కటాకటాలు లెక్కపెడుతున్నాడు. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు లలిత్‌ దాగర్‌ పేరుతో ఓ మెయిల్‌ వచ్చింది. చెన్నైలోని కార్మికశాఖలో పే అండ్‌ అకౌంట్స్‌ అధికారిగా ఎంపికయ్యానని, తనకు ఉద్యోగి యూజర్‌ ఐడీ, తదితరాలను అందివ్వాలని కోరాడు. ధ్రువీకరణ కోసం చరవాణి సంఖ్య, రెండు పత్రాలను పంపాడు. అందులో నకిలీ నియామక పత్రం చూసి కార్మికశాఖ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ పేరుతో నియామకాలేవీ జరగలేదని గుర్తించి దిల్లీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అసోంకు చెందిన నూర్‌ మహ్మద్‌ అలీగా గుర్తించి, అరెస్టు చేశారు. అలీ ఇంతకుముందు వివిధ మంత్రిత్వ శాఖలే లక్ష్యంగా మోసానికి పాల్పడుతూ రూ. 4 కోట్లు కొట్టేశాడని అభియోగాలు ఉన్నాయి. ఇలాంటి ఓ కేసులో ఇంతకుముందే అరెస్టయ్యాడు. ఇటీవలే బయటకు వచ్చి.. రాగానే కార్మిక శాఖను మోసగించేందుకు విఫలయత్నం చేసి... మళ్లీ దొరికేశాడు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?