26 గ్రామాలకు బొట్టు నిరందితే ఒట్టు

గుంటూరు జిల్లా బాపట్ల:తీరా గ్రామలలో మంచినీటి కరువు వెంటాడుతుంది.

గత పది రోజులుగా గుక్కుడు మంచినీరు దొరకక నానా ఇబ్బందులు పడుతున్న ఒక్క నాయకుడు కానీ అధికారి కానీ బిందెడు నీళ్లు అందించిన పాపాన పోలేదని తీరా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలలో మేము నాయకులం అని చెప్పుకునే చోట నాయకులు కూడా తమ వైపు కన్నెత్తి చూడటం లేదని వారికి మా ఓట్లు తప్ప మా సమస్యలు పట్టవని ప్రజలు వారి బాధ ను వెళ్లగక్కుతున్నారు,

తీరా ప్రాంతంలో ఉన్న 26 గ్రామాలకు  బొట్టు నిరందితే ఒట్టు అంటున్నారు.

అధికారులు,నాయకుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని రోధిస్తున్నారు.

పక్క రాష్ట్రమైన మద్రాసులో నీటి కష్టాలు టీవీలలో చూస్తున్నామని వారికి ఎంత బాధ ఉందొ తమకు అంతకన్నా మంచినీటి ఎద్దడి ఉందని గ్రామస్తులు అంటున్నారు.

నాయకులకు.అధికారులకు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే టీవీలలో ప్రతి నిమిషానికి ఒక సారి చూపించే మీడియా కి తీరా ప్రాంతంలోని సామాన్యుల మంచినీటి సమస్య కానరావడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

బిందెడు నీళ్ల కోసం కిలో మీటర్ల దూరం వెళ్లి నానా అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?